పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/109

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


త్యున్నతభంగిగా నసురు లుధ్ధతివైచిన భక్తిభావసం
పన్నుని వెన్నునిన్ హృదయపద్మములో నిడియుండె నవ్వుచున్.[1]

307


క.

వారిధి సంక్షోభించి మ, హారభసముతోడఁ దరఁగలను హస్తములన్
దీరంబుఁ జేర్చె విష్ణుస, మారాధనసంప్రమోదు నాప్రహ్లాదున్.[2]

308


వ.

ఇట్లు హిరణ్యకశిపుప్రయత్నంబులనైన యుషద్రవంబులవలన ముక్తుం డైనభగవ
ద్భక్తుని మహానుభావంబును చూచి సకలభూతంబులు నతని వాసుదేవునియప
రావతారమూర్తి యని కొనియాడుచుండె నట్టిసమయంబున.[3]

309

భక్త్యతిశయముచే వినుతించు ప్రహ్లాదునకు శ్రీహరి ప్రత్యక్షంబగుట

తే.

తనకు నట్టిమహామహత్వంబు కరుణ, నొసఁగి మన్నించినట్టిపయోజనాభు
డెందమున నిడి సంతతానందహృదయుఁ, డగుచు వేదార్థయుక్తి నిట్లని నుతించె.[4]

310


సీ.

నారాయణాయ పంకేరుహనేత్రాయ వాసుదేవాయ శ్రీవల్లభాయ
నిత్యాయ పరమాత్మనే నిర్వికారాయ శుద్ధరూపాయ జగద్ధితాయ
గోబ్రాహ్మణహితాయ గురుధర్మమూర్తయే బ్రహ్మణ్యదేవాయ పరమపావ
నాయ సదైకరూపాయ గోవిందాయ సనకాదియోగీంద్రసన్నుతాయ


ఆ.

త్రిగుణవిరహితాయ శ్రీహృషీకేశాయ, కీర్తితాఖిలాయ కేశవాయ
దురితనిరసనాయ తుభ్యం నమోనమో, యనుచు భక్తి యుక్తి నభినుతించె.[5]

311


చ.

అని వినుతించుచున్నసమయంబున శ్రీతరుణీకుచోపగూ
హనపరిశోభితంబు లగుహస్తప్రయోజవిరాజితంబులై
యనుపమశంఖచక్రము లుదంచితచంద్రదినేశకాంతులన్

  1. క్రన్ననన్ = శీఘ్రముగా, నాగపాశములన్ = పాములనెడు త్రాళ్లచేత, నిబిడంబులు = దట్టములైనవి, వసుధాధరములు = కొండలు, ఉద్ధతిన్ = నిక్కుతో, వెన్నునిన్ = విష్ణుదేవుని.
  2. వారిధి = సముద్రము, సంక్షోభించి = కలఁగి, మహారభసముతోన్ = అధికమైనత్వరతో, తరఁగలు అలలు, విష్ణుసమారాధనసంప్రమోదున్ = విష్ణుని లెస్సగా నారాధించుటచేత సంతోషమునొందినవానిని.
  3. ముక్తుఁడు = విడువఁబడివవాఁడు, మహానుభావంబులు = ప్రభావములు, అపరావతారమూర్తి = రెండవయవతారము నొందినమూర్తిగలవాఁడు.
  4. మహామహత్వంబు = మహిమకలిగినవానితనమును, డెందమున్ = మనసునందు, సంతతానందహృదయుఁడు = ఎడతెగనియానందముతోడి మనసుగలవాఁడు.
  5. పంకేరుహనేత్రాయ = తామరలవంటి కన్నులు గల, నిత్యాయ = శాశ్వతుఁ డయిన, నిర్వికారాయ = వికారరహితుఁ డయిన, జగద్ధితాయ = మేలు చేయునట్టి, గురుధర్మమూర్తయే = పూజ్యమైన ధర్మమే స్వరూపముగాఁగల, బ్రహ్మణ్యదేవాయ = బ్రహ్మజ్ఞానులకు దేవుఁడైన, సదైకరూపాయ = సత్తై ఒక్కటియైన రూపముగల, త్రిగుణవిరహితాయ = సత్వరజస్తమస్సు లనెడు మూఁడుగుణములు లేని, హృషీకేశాయ = ఇంద్రియాధిదేవత యైన, కీర్తితాఖిలాయ = స్తోత్రముచేయఁబడిన సర్వలోకములు గల - ఎల్లవారిచేతను పొగడఁబడిన, దురితనిరసనాయ = పాపములను పోఁగొట్టునట్టివాఁడైన, తుభ్యమ్ = నీకొఱకు, నమోనమో = మాటిమాటికి నమస్కారము (చేసెదను), అభినుతించెన్ = స్తోత్రము చేసెను.