పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/107

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.

అని యతండు గోవిందపదారవిందస్మరణాహ్లాదుం డగు ప్రహ్లాదునిసర్వాంగం
బులు కాలపాశంబులంబోని ఘోరపాశంబులతో బంధించిన నతండు విశ్వంభర
ధ్యానానూనమానసుండు గావునఁ దద్బంధంబులెల్లం దెగియె అప్రమాదంబు
లైనదిగ్గజంబులచేఁ బొడిపించిన నతండు నరసింహస్తోత్రపవిత్రుండు గావునఁ
దద్వారణవిషాణంబు లంగంబున భంగంబులయ్యె మఱియు నొక్కనాఁడు సూప
కారు లగురాక్షసుల చేత విషం బన్నంబుతోడం బెట్టించిన నతండు భగవద్ధ్యా
నామృతపాననిరతుండు గావున నవ్విషం బన్నంబుతోడన జీర్ణంబయ్యె. వెండియు
నొక్కనాఁడు భార్గవనిర్మిత యగుకృత్తిచేతం జంపింప సమకట్టిన నతండు జనార్దన
భక్తజనబంధుండు గావునఁ దదీయమాయాపనేయుండయ్యె. వెండియు నొక్క
నాఁడు శంబరాదిరాక్షసులచేత మహామాయాంధకారంబు గల్పించిన నతండు
సుదర్శనధరమంత్రానుష్ఠానపరుండు గావునఁ బ్రకాశదేహుండయ్యె. మఱియొక్క
నాఁడు మహాప్రళయవాయువుఁ గల్పించి శోషింపంజేసిన నతండు భుజంగశ
యనసంగతహృదయుండు గావున సప్రాణుండయ్యె. ఇట్లు హిరణ్యకశిపుమాయో
పాయనికషణంబులు ప్రహ్లాదభక్తిజాంబూనదం బొరయుచుండె నంత.[1]

298


ఉ.

విస్మయ మొప్పఁగా దనుజవీరుల మాయలచేత బ్రుంగుఁడై
భస్మములోపల న్మెఱయు పావకమూర్తియుఁబోలె వాసుదే
వస్మరణప్రభావమున వర్ధితుఁడై వెలుఁగొందుచుండె మం
దస్మితసుందరాననమునన్ దనుజేంద్రసుతుండు పెంపుతోన్.[2]

299


చ.

ఒకమరి విష్ణుభక్తిగలయుత్తములన్ గొనియాడు మెచ్చు వే
ఱొకమరి విష్ణునిం గొలువనొల్లనిమూఢులఁ జూచి నవ్వు నొం
డొకమరి విష్ణుభక్తి మది నుబ్బిన నిబ్బరమందుచుండు నా

  1. గోవింద...హ్లాదుండు = శ్రీహరియొక్క పాదపద్మములను స్మరించుటచేత సంతోషమునొందినవాఁడు, కాలపాశంబులంబోని = యమపాశముల వంటి, ఘోరపాశంబులతోన్ = భయంకరము లైనత్రాళ్లతో, విశ్వంభర...మానసుండు = ఎల్లలోకములను భరించునట్టివాఁడైన శ్రీహరియొక్క ధ్యానముచేత కొఱఁతలేనిమనసుకలవాఁడు, అప్రమాదంబులు = ఏమఱుపాటు లేనివి, తద్వారణవిషాణంబులు = ఆయేనుఁగులకొమ్ములు, సూపకారులు = వంటవారు, కృత్తికా = కృత్రిమభూతమును, ఆపనేయుఁడు = పోఁగొట్టఁదగినవాఁడు, సుదర్శన...పరుఁడు = చక్రధరుఁ డైనశ్రీవిష్ణునిమంత్రమును అనుష్ఠించుటయందు ఆసక్తుఁడు, భుజంగ...హృదయుండు = శేషశాయితో కూడుకొన్న హృదయము గలవాఁడు - శ్రీవిష్ణువును మననున నిలిపి ధ్యానము చేయువాఁడు ఆనుట, నికషంబులు = ఒరగండ్లు, జాంబూనదంబు = బంగారు.
  2. విస్మయము = ఆశ్చర్యము, బ్రుంగుడు = పూడినది - కప్పఁబడినదనుట, పావకమూర్తి = అగ్నియొక్క ఆకృతి, వర్ధితుఁడు = పెంపఁబడినవాఁడు, మందస్మితసుందరాననమునన్ = చిఱునవ్వుచేత అందమైన మొగముతో.