పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/105

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


కటిపసిబిడ్డనిన్ దనుజకంటకుఁ డైనపయోరుహాక్షు నే
మిటికి నుతింపుమంచు నియమించితి వేమనువాఁడ నిన్ను నీ
కుటిలచరిత్రము ల్వినినఁ గోపమువుట్టదె యెట్టివారికిన్.[1]

284


చ.

అనవుడు నాగురుండు దివిజాంతక నాయెడఁ దప్పులేదు నీ
తనయునిచేత లీదనుజదారకకోటి యెఱుంగు వీఁడు నా
పనుపున గద్యపద్యములు పాఠము చేయఁడు చేసెనేనియున్
మనసున విష్ణుచింతనము మానఁడు వీనివిరాళి యెట్టిదో.[2]

285


ఉ.

నావుడు దానవేశ్వరుఁడు నందనుఁ జూచి గురుండు చెప్పిన
ట్లీవు పఠింతుగాని యిఁక నెన్నఁడు నాకు విరోధి యైనల
క్ష్మీవిభుఁ బ్రస్తుతించెదు సుమీ మనవంశములోన లేనియీ
కావల మేల నామహిమకంటెను వానిమహత్వ మెక్కుడే.[3]

286


ఆ.

పొమ్ము పుత్ర నీవు బుద్ధిమంతుండవై, చదువు మనుచు బుద్ధి చాలఁ జెప్పి
పసుప నింటి కరిగి ప్రహ్లాదుతోడ న, గ్గురుఁడు పలికెఁ జాలఁ గుస్తరించి.[4]

287


మ.

విను మీతండ్రి సమస్తలోకములకు న్వీరుండు పంకేరుహా
సనునిం గూర్చి తపంబు చేసి మహిమన్ సంధిల్లుచున్నాఁడు గా
వున లక్ష్మీవిభుఁ గొల్వ నొల్లఁ డివె నీవుం జూడ నాతోడ నా
డినవాక్యంబులపద్ధతుల్ చదువురూఢి న్నీతిశాస్త్రావళుల్.[5]

288


వ.

అనిన దైత్యనందనుం డతని కిట్లనియె.

289


క.

విను నాతండ్రికిఁ బుట్టిన, పెనువేదుఱు నీకుఁ బుట్టి పీతాంబరునిన్
వినుతించి కొలువఁగా వల, దని పలికెద వకట యెంతయజ్ఞానివొకో.[6]

290


ఉ.

కేవలపాపకర్మములఁ గీల్కొని యున్ననిశాటకోటి నీ
కైవసమై పురోహితము గైకొని సేయుటఁ జేసి నీకు ల
క్ష్మీవిభుని న్భజించుటకుఁ జిత్తము గొల్పదు గాన నెంతయున్
నీవు వివేకహీనుఁడవు నీచదువు ల్విననొల్ల నెన్నఁడున్.[7]

291


చ.

అనిమిషలోకరక్షణపరాయణు దానవదైత్యభీకరున్
వనరుహలోచనున్ సుజనవత్సలునిన్ గరుణాపయోనిధిన్

  1. కటకట = అయ్యయో, బ్రహ్మబంధుఁడవు = జాతిమాత్రమున బ్రాహ్మణుఁడవు - నీచబ్రాహ్మణుఁడవు అనుట, చిన్నికూఁకటిపసిబిడ్డనిన్ = మిక్కిలిపసివాఁడైవ పిన్నవానిని, దనుజకంటకుఁడు = రాక్షసబాధకుఁడు, పయోరుహాక్షున్ = కమలములవంటి కన్నులుగలవానిని - విష్ణువును, కుటిలచరిత్రములు = వంకరనడకలు.
  2. దివిజాంతక = దేవతలకు యముఁడవైనవాఁడా, చేతలు = చేష్టలు, దారకకోటి = బాలురసమూహము, నాపనుపునన్ = నాయాజ్ఞ చొప్పున, విరాళి = ఆసక్తి.
  3. కావలము = మూఢత్వము.
  4. కుస్తరించి = బుజ్జగించి.
  5. సంధిల్లుచున్నాఁడు = కూడుకొనుచున్నాఁడు, పద్ధతులు = మార్గములను.
  6. వేదుఱు = పిచ్చి, పీతాంబరునిన్ = విష్ణుని, అకట = అయ్యో.
  7. కీల్కొని = అంటి, నిశాటకోటి = రాక్షససమూహము, కైవసము = స్వాధీనము, గొల్పదు = ఉత్సహింపదు.