పుట:Andhra-Natakamulu.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

43

నాటకప్రదర్శనము.

వ్రాయబడుటయు, పార్శీస్వరములతో బాడపడుటయు నిప్పిటికినిగరుగుచున్నది. ఈపాటలును, ఈమట్లును మననాటకచరిత్రమునెల్లకాలము వేనోళ్ళజాటుచునే యుండును. బాపటు కంపెనీయును, బలవంతరావు కంపెనీయును, మనదేశములో జాలకాలమువఱకు సంచారములుచేసి నాటకప్రదర్శనమందు మనవారికి గొంతయభిరుచి గుదిర్చినవి. అంతకంతకు గ్రమముగా మనప్రదర్శకశిఖామణులు జాతీయబంధనముల విడ నాడి యాంధ్రనాటకమున కాంధ్రత్వమును దెచ్చుచున్నారు. ఇప్పుడు దేశమందన్నిచోట్లాంద్రత్వ నిరూపణమందు హెచ్చుతక్కువలు కాన్పించుచున్నవి. గానివిజాతీయవిదేశీయానుకరణోత్సాహములయందు వైముఖ్యమేయున్నది. ఇది కడు నంస్తననీయమైన విషయముగాదా!

1 దృశ్యజాలము (Scenery)

    మన నాటకశాలలయందు పదవికాదిదృశ్య జాలము మనదేశమందలి చిత్రలేఖనముతో బాటు విదేశీయవస్త్వనుకరణముగానుండెడిది. క్రమక్రమము గా దేశీయప్రకృతి మన వృత్తులయందు బెరిగినకొలది విదేశీయాభిమానము తగ్గుచువచ్చెను. ఇప్పటికిని నెల్లూరుపురమందిరమున నున్న నాటక రంగస్థలమున ముందు వ్రేలాడుచున్నతెర విదేశీయ చిత్రపటమే. అది యీజిప్టుదేశాధిరాజ్ఞయగు క్లియోపాత్రా తననిగ్రో చెలికత్తెలతో వినోదించుచున్న తీరుగ గాన్పించుచున్నది. మనచిత్రలేఖకు లిప్పటికి దేశీయవిషమములను