పుట:Andhra-Natakamulu.pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
42

ఆంద్రనాటకములు.

పద్దతిని, బళ్ళారిలో మఱియుకవిధమును యిట్లు తెలుగుదేశములో నానాదిక్కుల నానావిధముల నాటక ప్రదర్శనములు జరుగుచున్నవి ఈబేదములు సామాన్యముగ నాలుగైదు తరగతులక్రింద విభాగింప వచ్చును, అవేవనన:-

          (1) Scenery (తెరలు).
          (2) వస్త్రధారణము.
          (3) సంగీతము.
          (4) అభినయము.
          

  వీనియందలిబేదములు సామాన్యముగ నాయాస్థల ములయందున్న భాషాభెదములు, ఆచారవ్యచ్వహార భేదములం బట్టి కలుగుచున్నటుల సూక్ష్మదృష్టికి గోచరమగును. ఈభేదముల సూక్ష్మవివరణ మిచ్చట యనావశ్యకము. స్థాలీపులాకముగా గొన్నిటి మాత్ర మీక్రిందవివరించి, తద్విషయములలో నాయభిప్రాయమునుకూడ జెప్పెద.
   పురాతనకాలమునుంది వీధినాటకములు, బాగవతములు మనదేశములో నాడబడుచుండుట వాడుక. ఇప్పటికాలందాంగ్లేయ సంపర్కముచే నాటకములయందు నూతన పద్ధతులు వృద్ధినొందు చున్నవి. మొట్టమొదట నాటకప్రదర్శనము పార్శీ మరాటీ నాటకప్రదర్శనముల మాదిరిగ బ్రారంభింపబడిన విషయమెల్లఱకు దెలిసినదే. దీనికి గాను శాశ్వతమైన విదర్శనములు కృష్ణమాచార్యులు గారును, శ్రీనివాస్దరావుగారు ప్రభృతులువ్రాసిన పాటలే. అవి పార్శీమట్లమీదను,