పుట:Andhra-Natakamulu.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
44

ఆంధ్రనాటకములు.

సభక్తికముగ గమనించి దేశీయచిత్రలేఖనమును వృద్ధినొందించుచున్నారు. రవివర్మ తన పటములయందు మన పురాణకధలను జిత్రించి యుండుటచే దేశీయులెల్లఱకు మార్గదర్శకంబయ్యెను. అవియైనను విదేశీయ సంసర్గము కేవలము విడువ లేదనియే కొందఱి మతము. వంగదేశమునందు వంగీయచిత్రలేఖన ముద్ధరింపబడినటుల మన యాంధ్రదేశమందు మన దేశప్రకృతికి సరిపోవునొక నూతనకళపౌడ సూపుచున్నది. అయ్యది ముఖ్యముగా బందరు, రాజమహేంద్రవరపట్టణము లలో బ్రారంబింపబడినది. బందురులోనున్న యాంధ్ర జాతీయకళాలయందును రాజమహేంద్రవరములో కీర్తిశేషులయిన దామెర్ల రామారావు ప్రభృతులచేతను నాంధ్రదేశీయ జిత్రలేఖనాకల వెల్లడిజెందినది. అది యింకను బ్రత్యేకాంధ్రవ్యక్తిని బ్రత్యక్షముగా సగౌరవముగా జూపుటలేదు. కాని యట్టి భావిపరిణామమునకు మార్గదర్శినిగానున్నది. మన నాటకశాలాధి కారులీ నూతన కళాద్యోతికులగు చిత్రలేఖకుల సహాయము జేకూర్చుకొని, తమరంగస్థలముల దేశీయచిత్ర పటములతో నలంకరింపవలసి యున్నది. దేశీయ ప్రకృతి వర్దిల్లినకొలది దేశావ్యక్తి విస్తరిల్లునుగదా!

[2]వస్త్రాద్యలంకారములు.

  వస్త్రాద్యలంకారములయందు మననాటకుల కౌచిత్యము కంటె జాపల్యము హెచ్చు. మణిన్ధగిత భూషణములును.