పుట:Andhra-Natakamulu.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

39

సుఖాంతనాటకములు, దు:ఖాంతనాటకములు.

దు:ఖాంతముగ జేసినచో వీరబొబ్బిలినాటకమును గూడ దు:ఖాంతముగ జేయగూడదా? అట్లుజేయుటయు దేశచరిత్రకు వ్యతిరేకమే ఏలయన బొబ్బిలివీరుల రుధిరధారలచే దడిసిన నంగరాంగణము తడియారకుండనే బాలుని వేంకటరాయుని పితృవైతామసింహాసనమున బూసీదొర యాసీనునిగ జేసెనని బొబ్బిలికధయందు జరిత్రకారులు జెప్పియున్నారు. ఆహేతుచే వీరబొబ్బిలికధ రంగారాయమరణముచే దు:ఖసమగ్రమయ్యెనని చెప్పవలసిచ్వచ్చినది. కావున నేకధనైనను నిర్హేతుకముగ నిరాధారముగ భేదాంతముజేయుటకు గవి కధికారములేదు.

    అనేకశతాబ్దములనుండి జాతిమతసంరక్షణకొఱ కేమి, దేశసంరక్షణకొఱకేమి రక్తదారలలోమునిగి యసువులు గోల్ఫోయిన మహావీరులగు స్త్రీపురుషుల చరిత్రేలో బరిపూర్ణమైన పుణ్యభూమి యగు నీభారతవర్షంబున నిజమగు విషాద చరిత్రల కెమికఱవు? మలికాఫరుతో బోరాడి రనరంగంబున బ్రాణముల వీడిన దేవగిరిప్రభువగు రామదేవుని చరిత్రేములేదా? పరదేశీయులగు శకశత్రు దశములతో బోరాడి కదన రంగంబున వీరస్వర్గమును జూఱగొనిన భోజమహారాజు చరిత్రము లేదా? అక్బరుపాధుషాసేనలు యుద్ధతికోహాతించగ నడుముగట్టి పురుషవేషముదాల్చి కత్తిచే బూని మొదలాయిసేనలతోబోరి ప్రాణములవీడిన యహ