పుట:Andhra-Natakamulu.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
40

ఆంధ్రనాటకములు.

మద్నగరురాణియగు చాందుబీబీ చరిత్రములేదా? మానసంరక్షణార్ధమై యల్లాయుద్దీనుతొ బోరియు నురు లొసంగి చిరకీర్తిగొనిన రాజదంపతులగు పద్మినీభీమసింగుల చరిత్రములేదా? ఇట్లనేకములగు నుద్రేకపూరితములగు మహావీరుల జీవిత చరిత్రములు మనదేశచరిత్రయందు గలవు. ఇంక సాంఘిక జీవితములలోనైన నదర్శభరితములైన చరితములు గొన్ని కాన్పించుచున్నవి. భర్తకొఱకు ప్రాణముల వీడి పాతివ్రత్యము నిల్పిన కామమ్మకదలెదా? అత్తగారి యొక్కయు నాడుపడుచుల యొక్కయు యసూమా మాత్సర్యములకు బార్నియై మున్ను "ఓతెల్లో" చేత "చెస్డిమోనా" హత్యంబొందినట్లు దన భర్తచే జంప బడిన లక్షమ్మలేదా?ఇట్టి కధలన్నియు మన దేశమందు జరిగినవే. ఇవి దు:ఖాంతనాటకముల కనునగు విషయములుగావా? ఈకధలను దీసికొని యేమహానుభావుడైనను వ్రాసినయెడల నాంగ్లేయ వాజ్మయములో నుండి మనవారిచే ననవరతము గొనియాడబడుచున్న "ఓతెల్లో" "జూలియసుసీజరు" "ఆంతోనీక్లేయోపాత్రా" మున్నగు మబాదు:ఖాంత నాటకముల కిసుమంతయేని దీసిపోవునా? కావున నాటకకధలకొఱకు మనదేశచరిత్రలను బరిశోధించు చున్న బాలకవులును వృద్ధకవులును నిట్టికధల నాదరించి తమ కవితాపటిమనే శోభిల్లజేసి శోకరస నాటకములను దు:ఖపరిణామముగనే వ్రాసి జనసముదాయమందు గారుణ్యరసభావములను మేల్కొలుపుటయు మానవజీవితమందలి త్యాగామీద్య