పుట:Andhra-Natakamulu.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
38

ఆంధ్రనాటకములు.

శ్రీనివాసరావుగారికి సమకాలికుడై, సహవాసియై, సహోద్యొగియై యాయనవలె ననేకాంధ్రనాటకముల రచించె నెక్కండ్రచే నాంధ్రనాటక పితామహుడని యెన్నికనొందిన ధర్మవరము కృష్ణమాచార్యులవారు 'విషాదసారంగధర ' మను పేరను సారంగధరనాటకము ను దు:ఖాంతముగ వ్రాసినారు. సారంగధరుని కధరునికధ మనము వెనుకటిగ్రంధములలో దేనియందు జదివినను సుఖాంతముగనుండెనుగాని దు:ఖాంతమును బొందియుండలేదు. పదునాఱవ శతాబ్దమున బ్రబంధరూపమున చేమకూరవేంకటకవి వ్రాసిన సారంగధరచరిత్ర సుఖాంతముగనేయున్నది. పదునెనిమిదవశతాబ్దములో గూచిమంచి తిమ్మనకవి వ్రాసిన సారంగధరచరిత్రమనెడి ద్విపదకావ్యములో గూడ నట్లేయున్నది. మఱియు యక్షగానములలో సైతము మోదాంతమే, కర్ణాకర్ణికగా సిద్ధుని చికిత్సక్రియలచే నంగవైకల్యం తగ్గి పునర్జీవితుడయ్యెనని తెలియుచున్నది. ఇట్లందు గృష్ణమాచార్యులుగరు సారంగధరుడు మరణించి నట్లు వ్రాయుట కేవలము చరిత్రకు విరుద్ధమైనది. చరిత్రకు విరుద్ధమగుటచే యధార్ధముంకు దూరమగును. యదర్ధమును దప్పించుట కల్పనకొక గొప్పకళంకము, కావున గృష్ణమాచార్యులుగారు శ్రమజెంది నూతనమార్గమున వారొనర్చిన కార్యము సమంజసముగాదనియు సమర్ధనీయముగదనియు నేజెప్పసాహసించుచున్నాను. సారంగధరనాటకమును