పుట:Andhra-Natakamulu.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

35

సుఖాంతనాటకములు, దు:ఖాంతనాటకములు.వాలు పాఠ్యం

నాటకము కేవలము దు:ఖాంతముజేసి ప్రేక్షకుల యుల్లంబుల విషాదముమాత్ర్ము నెలకొల్పి వారిని గృహములకంపు యేటిఉరుషార్ధమని కొందరు శంకింప వచ్చును. తెరుపులేని శోకసముద్రమున ముంచి నిస్సహాయముగా నుంచుటకంటె దు:ఖాంబుదికంతకు నౌకలనందగు కరుణామయుండగు భగవంతుని నిరంతరసాన్నిధ్యమును నిర్నిమిత్తసాహాయ్యమును ప్రదర్శించుటయే యోగ్యతమముగాదా యని యాక్షేపింపవచ్చును. విపదవస్థలలోనున్న మానవుని రక్షించుటయే పరమావధియనియు నట్టి రక్షణభగవంతుడు తప్ప వేరొకరు సంపూర్ణముగా జెయలేదనియు దెలుపవలసినచో నాసంవిధాన మితర గ్రంధము లన్నింటిని యేల వర్తింపగూడదు? ఒక్కనాటకములకే మనవారు నిర్ణయింపవలసినదేల? అనేకమైన పాటలు, పదములు కదెహలు వ్రాయబడినను అందీ నియమము ప్రకృతికి విరుద్ధముగానుండక జీవితాదర్శములతో సమన్వితమై యుండవలయును గాన చరిత్రలోగాని, నాటకముల లోగాని, నవలలోగాని కధలు పాటలు పదములు మున్నగు వానియందుగాని దు:ఖపరిణామముగా నున్న జీవితమట్లె నిరూపింపవలయును. సుఖాంతము జేయుటకై భగవంతుని ప్రత్యేకము తెచ్చిపెట్టి రక్షణయొనర్చుట స్వభావవిరుద్ధమని నాయాశయము.