పుట:Andhra-Natakamulu.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
34

ఆంధ్రనాటకములు.

క జూచుకొని యనుమానపు భర్తలలో నగ్రగణ్యుడగు శ్రీరామచంద్రుడు సీతను పున:పరిగ్రహించెను. ఈద్రావిడ ప్రాణాయామ మంత్రమును జూడుడు. సుఖాంతముగా గనబరుచుటకు గవి పడిన పాట్లు జూడుడు, ఇంత యవస్థను బొందనేల? అసలుకధ నున్నది యున్నటుల వ్రాసిన నేమి విపత్తుగలుగును?

   బహుకష్టజీవియై భర్తయొక్క పరీక్షలతో విసివి వేసారిన పుణ్యసాధ్వీలలామ యగు సీతాదేవి తన కడపటి పరీక్షకాలము దల్లియగు బూదేవినుద్దేశించి పలికిన దీనాలాపములను వినుడు.

శ్లో॥"సర్వాను సమాగతాన్ దృష్ట్యా ఏతాకాషాయవాసినీ
  అబ్రవీత్ ప్రాంజలిర్వాక్య మధోదృష్టి రవాణ్ముఖీ।
  యధావం రాఘవాదన్యం మనపాపించింతయే
  తధామే మాధవీదేవీ వివరం దాతుమర్హతి।
  మనసా కర్మణావాచాయధారామం సమర్పయే
  తధామే మాధవీదేవీవరం దాతుమ్హరతి।
  యధైతత్ సత్యముక్తంమే వేద్మిరామాత్పిరంనచి
  తధామే మాధవీదేవీవినగం దాతుయర్హతిక।"

   ఈదుర్భరశోకగర్భితములగు శాంతవచనములు మానవహృదయములను పరీక్షించునవి యా లేక భవభూతి వ్రాసిన సీతావనవాసనాటకమా? చదువరులే నిర్ణయింతురు గాక!