పుట:Andhra-Natakamulu.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
36

ఆంధ్రనాటకములు.

  ఆధునిక నాటకకవులలో బ్రధమశ్రేణియందుండవ దగిన కోలాచలంశ్రీనివాసరావుగారు వ్రాసిన "రామరాజు" లెక "విజయనగర సామ్రాజాంశ" మనడి నాటకము నిక్కముగ విషాదనాటకమే. కవీశ్వరుడు సంస్కృతనాటక నియమముల నుల్లంఘింపలేక సుఖాంతముజేసినటులెవ్వనికైనను దోపక మానదు. దు:ఖాంతముజేయుట చరిత్రయందలి యదార్ధము నకు సరిపోవును. ఏలయన యుద్ధరంగంబున రామరాజు మరనముతో విజనగరసామ్రాజ్యము గూడ మరణించినదను విషయము చరిత్రకారులు స్థిరముగ జెప్పెనదే. రామరాజు తరువాత నతని సింహాసనము నధిష్టించినవారు లేరు. సామ్రాజ్యమును వెనుకటియుచ్చదశకు దెచ్చినవారును లేరు. కాబట్టి రామరాజుసుగునములచే బేరొందిన రాజ్యమతని యనుగుణములచే శిధిలమొందెనుగావున దు:ఖాంత నాటకములకిదియొక గొప్పనిదర్శనమగును. ఆప్రకారము కవి తన గ్రంధమును ముగించినయెడల బ్రపంచమందలి గొప్పదు:ఖాంతనాటకములకిది యీడుదీయకపోవును. "జూలియసుసీజరు" "కేటో" "గట్సువాన్ బెర్లిషింజను", మున్నగు మహావీరుల గురించి వ్రాయబడిన దు:ఖాంతనాటకములతో దుల్యమై విరాజిల్లుచుండవలసినదే,అట్లుచేయక నూతననాటక మార్గదర్శియయ్యెను సుఖాంతనియ మమునకు దాటలేక యీగొప్పనాటకమునకు దీరని కొఱంతగలుగజేసెను. ఆలోటునుదనసామాజికులు దీర్చినను కవీశ్వరుని ప్రతిభయందలి కళంకమట్లె