పుట:Andhra-Natakamulu.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

27

పాత్రపోషణము.

గుణానగునములు యధాస్థితిగ వర్ణింపదగినవిగాని, మార్చుటకు వీలుపడదు. మార్చినచో దగినహేతువులుండవలయును. క్రూరుడగురాజు క్రూరుడుగనే వర్ణింపదగును. మనము కరుణించి వానిని దయార్ద్రహృదయునిగగజ్నపరచుట సత్యమునకు విరుద్దము. అట్టిగ్రంధము స్వభావప్రకృతిని విడనాడి నింద్యమగుచున్నది. అయిన నొకానొకపురుషుని గూర్చి వేఱ్వే అభిప్రాయములు చరిత్రలోగాని, యితరప్రాచీన గ్రంధములలో గాని చెప్పియుండినయెడల మనకిష్టమైన దానినిగ్రహించి యాపత్రను నిరూపింప వచ్చును. అంతకంటె హెచ్చు స్వాతంత్ర్యము గ్రంధకర్త కులేదు.

3. కల్పితములు.

  కల్పితపాత్రములగూర్చి పాత్రములగాని, గునములగాని, కల్పించుతకు దనయిష్తమువచ్చి నట్లు నడపింపవచ్చును. అయిననేపాత్ర్ను మొదట నొకవిధముగాను ఆగ్రంధమందే తరువాత వేఱొకవిధముగాను మార్చివేయుట యక్రమము, అస్వాభావికము, అట్టిమార్పు నిరూపించుటకు, బ్రబల కారణములు గ్రంధమందుండవలయును. లేనిచో బాత్రపొషణ క్రమానుగత సమన్యము (Consistency)  పొందనేరరు. సమన్యయములేని పాత్రము స్వభావవిరుద్ధమయి రుచింపనేరదు. కలభాషిణి చంచలహృదయ, ఆమరణాంత మట్లే నిరూపింపబదినది. ఆనాయిక తనసుకృతముల ఫలముగ రెండవజన్మమందు