పుట:Andhra-Natakamulu.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
28

ఆంధ్రనాటకములు.

బతివ్రతగా మారినది. వసంతసేనమొదటినుండియు పతివ్రతయే. సుప్రసిధ్దకవిపుంగవుడగు షేక్స్పియరు కల్పించిన ఫాల్ స్టాపు (Falstaff,) లనుపాత్రము ఆయనరచించిన రెండుమూడు నాటకములందు గానుపించును. ఎచ్చటనయిన నొకేవిధముగ నింద్రియ వ్యాపారలోలుడు గాను నిత్యసుఖైక పరాయణుడుగాను కనబదునుగాని, యొక నాటకమునందోకరీతిని మరియొకనాటకమునందు మరియొకరీతిని జిత్రింప బడలేదు. ఈవిధమగుసమన్యమము మహాగ్రంధ కర్తలందరు తమకల్పితవ్రాతలయందు బాటించియే యున్నారు. ప్రధమమున రాగోద్రేకుడుగానున్న మనుజడంతమందువిరాగిగా బరిణమించుట తటస్థించును, ఆమానసికపరిపాకమునుబ్రబల కారణములచే నిర్వహింపనిచో బాత్రపోషణయందు వెల్తి గలుగును. కావున కల్పితపాత్రముల విషయములలో గ్రంధకర్తతనపాశములచే దానె కట్టబడియుండును.

             ------