పుట:Andhra-Natakamulu.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
26

ఆంధ్రనాటకములు.

ముందు మనమొకసంగతి వ్యక్తపరుపవలసి యుండును. పౌరాణికకధలననెవ్వి? ఇతిహాసములును అష్టాదశపురాణములును దేశ చరిత్రములును స్థలపురాణములును ప్రాచీనదాసరి పదములును మున్నగు నవన్నియుబురాణకధలని యే వ్యవహరింపవచ్చును. ఈకధలయందలి స్త్రీపురుషుల గుణపోషణము నాటకముల యందెట్లు నిరూపింపవలయును? ప్రాయశ: ఆయాస్త్రీపురుషుల కాఆకధలయందేయే గుణవర్ణనలు జేయబడిన వో నాటకములయందును అట్టి గుణవర్ణనలే జేయదగినవి. అట్టి గుణవర్ణనములేని విషయములో గవీశ్వరుడు విశృంఖలుడయి యిచ్చానువర్తిగా నుండవచ్చును. ఏకపత్నీవ్రతుడగు శ్రీరాముడు, దక్షిణ నాయకుడగు శ్రీకృష్ణుడు, నిత్యసత్య్లవ్రతుడగు హరిశ్చంద్రుడు సర్వసంగపరిత్యాగియగు బుద్ధుడు, ప్రేమసాగరుడగు అశోకుడు, సుగుణఖనియగునీతి, పతివ్రతియగు సావిత్రి అద్బుతదేశాభిమానియగు అహల్యాబాయి, అద్వితీయ రాజ్యతంత్ర వేత్తయగు నూర్జహాను, అతిలోకపరాక్రముడగు బాలచంద్రుడు, పతివ్రతాశిరోమణియగు కామమ్మ, యిట్టివారిగుణ గణములు ప్రాచీనగ్రంధములయందు నిర్వచింపబడి సిర్ధములై యున్నవి. వానిని మార్చుట కెవ్వరికిని శక్యముగాదు. సీజరు, బ్రూటస్, ఆంధోని, మొదలగు చారిత్రక పాత్రముల గుణపోషణ ఆదేశచరిత్రలయందు బేర్కొనబడిన రీతిని యున్నట్లే మనపురాణముల యందును, చరిత్రలయందును స్థిరరూపమునయున్న నాయికానాయకులు