పుట:Andhra-Natakamulu.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పాత్రపోషణము.

తీవితంతువును గలన జేసి యామె యా యాదవ్చసింహుని జూచిమోహపారవశ్యమున మనో భవకెళియందు దనువుమమి కోరగా నాపురుషవరేణ్యు డామె నూరార్చి పాతివ్రత్యఫలంము నునద్దేశించెనట! ఈకల్పన శ్రీకృష్ణుని సత్ప్రవర్తనకెంత మెఱుగుపెట్టినదో నాకు దెలియదుగాని కవియొక్కకల్పనా చాతుర్యమందెంత యశ్లీదోసమున్నదో తేటపడుచున్నది. కావున పాత్రముల గునానగుణముల విశదీకరించుటకు గల్పించెడి యవస్థలు (Situations) ఆయాపాత్రముల గౌరవము నకు దగినవిగానుండవలెను. ఊహకు దోచినవెల్లయు వ్రాయుట సమంజసముగా నేరదు.

2 పురాణసిధ్దములు:-

    పౌరాణిక కధలు ప్రాచీనకాలమునుండియు బహు తరచుగ నాటకములగతిని వ్రాయబడుచున్నవి. తొలుదొల్త సంస్కృతభాషను గాళిదాసాది మహాకవులచే నాటకరూపములుగ వ్రాయచుండుట యెల్లరకుకు దెలిసిన విషయమే. కాని యొకానొక పౌరాణికపురుషుని గూర్చి పెక్కుండ్రు వ్రాసిన గ్రంధములలో బెక్కురీతుల గాన్పించుచున్నవి. ఒకేపురుషుడు వివిధగ్రంధముల లో వివిధరూపముల దాల్చుటయద్బుతము అసమంజసముకావున పౌరాణికకధలయందు వచ్చెడు పురుషులయొక్కయు స్రీలయొక్కయు పాత్రపొషణమెట్లుగా నుండదగునో విచారింతము. ఈ విషయమును చర్చీంచుటకు