పుట:Andhra-Natakamulu.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
24

ఆంధ్రనాటకములు.

  నాటకములయందలి పాత్రములగుణపోషణ జేయు టకు గుణవర్ణన జేసినమాత్రమున జాలదు. అనగా నొకా నొక పాత్ర మిట్టిట్టి గునములు గలదని యాయా గుణముల పట్టిక వ్రాసినసరిపోదు. ఆయాగుణముల విశ్డదీకరించు నవస్ధల గల్పించి యితరపాత్రముల సంభాషణలచే నభివర్ణనజేయించి ప్రదర్శించుట యుక్త మగుపద్దతి. ఈయవస్థల్ను కల్పించుటయం దుచితానుచితములను సందర్భాంసందర్భములను గుర్తెఱుగవలెను. శ్రీరాముడు దొంగవాడు కాడని తెలియ జేయుట కాతనిని దొంగలగుంపులో జేర్చి వారు చేయు క్రూరకృత్యముల నాయనచే దూషింపజేయుట పరి హాసాస్పదమగు పద్ధతిగాని, ప్రశంసనీయమగునది కాదు. ఏలయన, శ్రీరాముడు దూర్తుడుకాడని నిర్వ చనముచేయుటకు నవరంబెద్ది అనుటయందు ప్రతిదోషముగుణములేదని  ప్రత్యేకదృష్టాంత పూర్వకముగ జూచినగాని, ఆయనమయాత్మ్యము నకు గొఱంత గలుగునా? ప్రతి మహానుభావునియందును సుగుణములన్ని యు నున్నవనియు, దుర్గుణములెవ్వియు లేవని యు, ప్రత్యేకముగా నిదర్శనముల గల్పించి చూప నుద్దేశించిన గ్రందము నటకమనదగినదికాదు. నిరుపయోగమగు పద్రినముదాయమని చెప్పనొప్పు ను. ఒకానొకనాటక గ్రంధకర్త శ్రీకృష్ణునిగూర్చి వ్రాయుచు నామహానుభావ్ఫుడు దక్షిణనాయకు డయినను ఆయనదాక్షిణ్యములో నుచితానుచిత పరి జ్ఞతతగూద నున్నదని తెలియజేయుటకొక బ్రాహ్మణయువ