పుట:Andhra-Natakamulu.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

17

నాటకనిర్మాణము.

నాటక నియమములతో మనకు బనిలేదు. విస్తృతికి నవశకము పెరిగిన కొలది విసృతి విజృంభణములు గూడ బెరుగుచుండును గాన సూక్ష్మనిబంధనలకంటె స్వాతంత్ర్య్లమే యెక్కుచు మేలొనర్చును.

  ఇంక నాటకకధల విషయమై యొకించుక చెప్పి యీవిభారము ముగించెద. మన నాటకకధలు సర్వ సమాన్యముగ భారతరామాయణములు నష్టాదశపురా ణములనుండి తీయబడుచున్నవి. అందువలన గొన్ని లాభములును గొన్ని నష్టములునుగూడ గలుగుచున్నవి. మన హైందవజాతీయత నిల్చుటయు దైవభక్తి కుదురుటయు నతిలోకాదర్శములు నెలకొల్పు టయు మొదలగు లాభములున్నను జనసామాన్యము నకు నిజమగు దేశచరిత్రకజ్ఞానముగాని ప్రపంచవిజ్ఞానము గాని కలుగుట శకుంతల హరిశ్చంద్రుడు మున్నగువారి కధలే యనేక విధముల బరివర్తింపబడి నాటకరూపములుగా వ్రాయబడుచున్నవి. వీనివలన స్త్రీపాతివ్రత్యము, జీవితమందలి యాత్మత్యాగోత్కృష్టత మున్నగు హెందూధర్మ నియోగములు నిరంతరము మనకన్నులయెదుట గట్టబడుటచేత మన జీవ చరిత్రములు ఎల్లప్పుడును నాకాశగమన సంఛారుల వలెను లాపున్య (Laputn)  దేశస్థులు తమ ప్రపంచాతీత