పుట:Andhra-Natakamulu.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
18

ఆంధ్రనాటకములు.

భావములను మాత్రము పరిగణించుచున్నాము. మన మీమానన ప్రపంచమందు నివసించుటచేతను మానవ కోటిలో మెలగుచుండుటచేతను మనవలన దేశమునకు బురోవృద్ధి గలుగవలసి యుండుటచేతను మనకు మానవకోటికి సంబంధించినయుదంతమునే యెక్కుడుగ రచింపవలను. పోప్ (Pope) మహాకవీశ్వరుడు "The proper study for mankind is man" అని చెప్పియున్నాడు. మనుష్యవికారము లును నానాదేశములలో నానాకాలములనుండియు గలిగిన మార్పులను నిరూపించుట చేత జనసామాన్యమునకు గలిగెడు మనోవికాసమే జాతీయ వృద్ధికిని దేశాఇవృద్ధికిని తోడ్పక మానదు.

   అతిలోకమగు స్త్రీపురుషులను నిర్ణించుటలోఫ్ రెండు కష్టములున్నవి. దైవసమానులను మనుష్య సమానులుగా నిరూపించుట (Anthropomorphism)  యొక్క కష్టము మానవవృత్తులలో దగుల్కొనియున్న మనకు నతిలోక స్త్రీపురుషుల భావవికరములను సరిగా భావించుకొలేమి రెండవ కష్టము. ఈ రెండ కష్టముల వలనను గవీశ్వరులు తమగ్రంధములయందు లోపములు జేయుచున్నారు.
   నాటకములు కొంతవఱకు మహాప్రపంచమునకు జెందియున్నవని యీవఱకే చెప్పియుంటిమి దేవతలు రాక్షసులు గంధర్వులు నిత్యాద్యతిమానుష స్త్రీపురుషులగుఱించి  వర్ణించుట చేత నయ్యూగా ప్రపంచం మఱింత దరూహ్యా