పుట:Andhra-Natakamulu.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
16

ఆంధ్రనాటకములు.

జెందిన నాటకరూపముల యనుభవము లీ యభిప్రాయములను వేనోళ్ల ఖండించిచున్నవి. అట్టి విపరీతాభిప్రాయములకు బ్రపందానుభవమే సరియగు ప్రత్యుత్తరమనితలంచెద.

  సంస్కృత నాటకముల నిర్మాణము మున్నగు విషయ ముల నిర్ణయించెడు లాక్షణిక గ్రంధములు చాలవరకా భాషయందున్నవి. కాని యాంగ్లేయ నాటకముల నిర్ణయించెడు లక్షణగ్రంధము లాభాషయందు గొలదిక మాత్రము గాన్పించుచున్నవి. ఆకారణమున నాంగ్లేయనాటకము లిప్పటికిని నిరర్గళ పద్ధతుల విజృంభిచుచున్నవి. అంకనియమము తప్ప నితరవిషయములు సమాన్యముగ గానరావు. గ్రంధకర్త  యొక్క మనోభావములు నైసర్గికముగ వికసిజ్ంచి యధీష్టమసముల బెంపొంగుట కేవిధమగు నాటకము లుండవు. మానవజాతియొక్క్ ననారూప సౌందర్యము వానియందు సురుచిరముగ గానంబడును.
   మన తెలుగు నాటకముల కిప్పటివఱకు లక్షణ గ్రంధములలేమి యొక మహాబాగ్యమని నాతలంపు. ఈభాగ్య్లము  చిరకాలమునుండుగాక, సంస్కృత  నాటకవిధానమును దెలుగులయందు జొప్పించుటకు విద్వాంసులు చేసెడు ప్రయత్నములు వాని కంతగా మేలొనర్చునవి గావని నాయభిప్రాయము. తెలుగు నాటకములను దేశకాలపరిస్థితులకనుగుణ్యముగా వృద్ధినొంద నిచిటయే ముఖ్యకర్తవ్యమని నాయాశయము. శుద్దవిష్కంభములు విశ్రవిష్కంభములు నిత్యాదిసంస్కృత.