పుట:Andhra-Natakamulu.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
12

ఆంధ్రనాటకములు.

లనుండి చదువబడుచుండియు నాంధ్రభాషలో మాత్రము గతశతాభ్దమువఱకు నిజమైన నాటక మొక్కటియు గానరాకుండుట యందఱకు నచ్చెరువు గలిగించుచుండిన విషయమే. సంస్కృతనాటకములను బండితులు చదివి సంతోషించిరే గాని వానిని మన భాషలోని కనువారించుటగాని యనుకరించుటగాని జరుపరైరి. దీనిని గుఱించి పలువురు పలువిధములైన యభిప్రాయములను దెల్పిరి గాను ముఖ్యముగా నాదృష్టికి దోచిన కారణమేమన మన వాజ్మయములో సంస్కృతమునందుగని మఱి యేహైందవభాషయందు గాని పొడసూపని ప్రబంధ స్వరూఅ ముత్పత్తియగుట యే యని చెప్పదగినది. మన ప్రబంధములు సంస్కృతి నాటకములకును సంస్కృత కావ్యములకును మధ్యవర్తులు. వీనియందు నాటకముల యొక్కయు గావ్యముల యొక్కయు లక్షణములు సామాన్యముగ నుండుటచే వేఱుగా నాటకముల వ్రాయ నవసరము లేకపోయినది. ఇటీవల్ నాంగ్లేయ వాజ్మయము నందలి యనుభవము గలిగిన కొలది యాభాషయందున్న నవలలను నాటకములను మనవారు చదివి యామూర్తులను బట్టి ప్రతిమూరు లను సృష్టింప నుద్దేశించిరి. అందుచేతనే మొట్టమొదటనుండియు దెలుగు నాటకముల రచించిన వారాంగ్లభాషానకులయియున్నారు. నాటక రచననోద్ధేశ్యమాంగ్లభాషాస్పురిత మైనను నాటక రచన మాత్రము కేవల మాంగ్లభాషస జనితము కాదు. ఏలయన దెలుగు నాటక