పుట:Andhra-Natakamulu.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

11

నాటకతత్వము.

ములు, భావములు, కల్పనలు, రాగరసములు, ఉపమతిశయోక్తివర్ణన శమత్కృతులు మున్నగు మానసిక హృదయిక విశేషంబులు, ప్రతిమనుష్యుని యందును వేరువేరుగా నుండును. ఆంగ్లేయదేశౌ రాజు యొక్క మానస్వికొన్మీలనము (internal development) ఆంధ్రదేశపురాజుయొక్క మానసికో న్మీలనమును బోలియుండదు. రుష్యాదేశపురాజు యొక్క మానసికకృషి జపానుదేశపు రాజుయొక్క మానసికకృషికి సరిపోదు. ఈరీతిగ నితరపాత్రముల యందును దేశకాలపాత్రములబట్టి మానసిక, హృదయిక, భేదంబు లాపాదితంబులగు ఈదృశభేదంబులు సమాజపాత్రలయందును గాన్పించును గాన ఆయాభేదములు గనుపరచుచు భాస్ధాశైలిమాత్రము, సామాన్యముగా నుచ్చ నీచప్రమాణంబులను వర్తింపవలయును.

    ఆంధ్ర వాజ్మయమునం దీకాలము నవలలయొక్కయు నాటకముల యొక్కయు మహా యుగమని చెప్పనొప్పు ఏలయన నితర వాజ్మయ భాగములకంటె సామాన్యముగ నవలలును నాటకములును నెక్కువగ వ్రాయుబడుచున్నవి. మన వాజ్మయమం దేవిషయమునకయినను గీర్వాణవాజ్మయము మాతృకయయ్యు నాటక నవలా విషయములో మాత్ర మీయాచారము భేదించుచున్నది. సంస్కృత నాటకములు సుమారు రెండువేల సంవత్సరములయి మన దేశముందుండియు విశేషత; ఆంధ్రదేశమున బది పదునైదువంచల సంవత్సరము