పుట:Andhra-Natakamulu.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
13

నాటకతత్వము.

ముల వ్రాసినవారు సంస్కృత నాచజ్ఞానము గూద సంపాదించి యున్నవారే, కాబట్టి యాంధ్రనాటకములు కేవలమాంగ్లేయ నాటకముల పోలికను బొందకయు సంస్కృత నాటకముల పద్దతుల ననుసరించియు మధ్యమార్గముల ద్రొక్కి యొక మిశ్రమాకారమును వహించినవి. కధాసంవిధానమున సంస్కృత నాటకములను రూపనిర్మాణములో నాంగ్లేయ నాటకములను బోలియున్నవి.

  ప్రప్రధమమున నాంధ్రనాటక రచనకు గడంగిన మహానుభావుల దృష్టికొక గొప్ప వాజ్మయ సమస్య గాన్పించెనది. ఒకవైపున దెలుగు ప్రబంధములు, మఱియొక వైపున సంస్కృతనాటకములు,వేఱొక దిక్కున నాంగ్లేయ నాటకములు, ఈ మూటిప్రకృతులు వారి భావజ్ నైర్మల్యమును గలుగుండు పరిచినది. ఈ మూడు విషయములలో దేనిని ద్రోసివేయటకును వీలు లేక తుదకీ మూటికిని సమన్వయము చేయవలసి వచ్చినది. ఆకారణమున మొదటి తెలుగు నాటకము లీ మూటి యొక్క యాభావములుగా బరిణమించినవి. శైలియందు పలుగ్రంధములకు కధాపోషణయందును  నంగ నిర్మాణము నందును సంస్కృత నాటకములను భావభావనా విస్ఫురణయందు నాంగ్ల నాటకములను ననుసరించి యున్నవి. క్రమముగా బ్రబంధశైలిని విడనాడి సామాన్య నాటకశైలిని గ్రహించినను గీర్వాణ నాటకముల యొక్క