పుట:Andhra-Natakamulu.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
4

ఆంధ్రనాటకములు.

చున్నాము. కావున నాటకములు భావసౌజన్యములు కాని ప్రకృతి జన్యములు కావు. ఇవన్నియు భావనా ప్రతిపాద్యము లగూనప్పుడు పాత్రములు మాట్లాడెడు భాషమాత్రము భావనాప్రతిపాద్యము కాగూడదా?

   నాటకములయందు వాడుకొనెడిభాష మనుష్యులు సామాన్యముగా మాట్లాడెడు భాషవలె వచనరూపముగా నుండవలెనుగాని, పద్యరూపముగా నుండగూడ దని కొందఱి యభిప్రాయము. వచనరూపముగా మాట్లాడుట మానవస్వభావముగాన నాటకములయందును వచనమే యుండవలెనని వీరి సిద్ధాంతము, ఈసంగతిని గురించి యించుక విచారింతము.
   మనుష్యుడు మాట్లాడెడుభాష సాధారణముగా వచన రూపముగా నున్నను భాషాశైలి కొన్ని కొన్ని సమయములయందు పద్యరూపము ననుసరించు చుండుట యెల్లరకు విదితమే. ఎట్లన గోపము, శోకము, మోహము, విశ్లేషము మొదలదు మనో వికారములను, హృదయస్పందనములను, వెల్లడి పఱచునపుడు మనుష్యుల భాషాశైలి లక్షణరహిత మైన పద్యశైలిగా నుండు నని చెప్ప నొప్పు, మనయాదిమకవియగు వాల్మీకిమునియొక్క కోప స్ఫూర్తియేకదా ప్రధమ పద్యముగా బరిణమించినది.

శ్లో॥మానిషాద ప్రతిష్ఠాం త్వరమ॥ శాశ్వతీ॥సమా॥।
    యత్క్రౌంచమిబునాదేకమనధీ॥ కామమొహితం॥