పుట:Andhra-Natakamulu.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

3

నాటకతత్వము.

   అనేకశతాబ్దులలోగాని యనేక సంవత్సరములలో గాని లేదా యనేకదినములలో గాని జరగిన యితివృత్తము లను మనకన్నులయెదుట మూడు నాలుగు గంటలలో జరుగునట్లు కనపఱుపవలసి యున్నది. ముఖ్యాంశములనే తీసికొనినను కాల పరిణామము చాలదక్కువగా నుండును గాన ప్రేక్షకులు దమభావనాశక్తి నైపుణిచే లుప్తభాగములను బూర్తి చేసి కధనంతయు దదాదశన్ ములనుజ్ ద్యోతకము చేసికొన వలయును. ఈ సంగత్రినే షేక్స్పియర్ మాహా కవి యిట్లు నుడివి యున్నాడు;--
 "The best in this kind are but shadows-and the worst are no worse if imagination amend them.
 చాలాకాలమునందు జరిగిన సంగతులను కొలదికాలములోజరిగనట్లు నిరూపించుటచే మనము కాలప్రకృతికి కొంతవరకు వ్యతిరేకముగా నడచుచున్నాము.  మఱియు నాయాచరి త్రాంశములు, మొట్టమొదటజరిగినప్పుడే యేపురుషులును స్త్రీలును జీవించియుండిరో, వారందఱును గతించినను వారిస్థానముల యందు కొన్ని నూత్నపాత్రమ్లను గల్పించి యా యా యాఖ్యాయికలను మరల గోచరింప జేయుటచే బురుషప్రకృతికి వ్యతిరేకముగా నడచుచున్నాము. ఇట్లు దేశకాలపాత్రము లన్నిటియందును మనస్వక పోలకల్పనలచే నూతనసృష్టిజేయు