పుట:Andhra-Bhasharanavamu.pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ముళ్ళు విప్పెడువాఁడు ముడియవిడు పనంగ గండిదొం గనఁ గన్నకాఁ డనంగఁ
దగు సురంగాకారితస్కరనామంబు బందెకాఁ డనఁ దగు బందికారి
వేసములు వేసి నమ్మించి వెనుక నాచుకొనిన దొరకోలుసన్నాసి యనఁగ వెలయుఁ
దడికద్రోపరి యనఁగను దనరు నౌ కవాట నోదకుఁ డనఁగఁ జెవ్వందిలింగ.

291


సీ.

పరఁగుఁ దెక్కలి యన బందిపో టనఁగను గిలు వనఁ గాసులంకింపునాఁగ
దావర మనఁగను దావా యనంగను మ్రుచ్చిమి యనఁగను మ్రుచ్చిలి యన
దోఁగురు నాఁగను దోఁపడ మనఁగను దోఁపుడు నాగను దోఁపు నాఁగ
దొంగఱిక మనంగ దొంగతన మనంగఁ జౌర్యంబు చెల్లు వంచన మెసంగు
జుడుగు క్రుక్కుకికురు పిక్కుజుణుఁగు మొరఁగు డనఁగ గూఢనివసతి పొంచడ మనంగ
నలరుఁ గికురింపు కికురింత యనఁగఁ జెల్లు వంచనకరణ మగుచుఁ జెవ్వందిలింగ.

292


సీ.

బొండ యనంగను బోననఁ గూటయంత్రాభిధానంబుగాఁ దనరుచుండు
బందిక ల్లనఁగను బదనశిలాఖ్య యౌ నుచ్చునా నురి యన నొప్పుచుండుఁ
బక్షిబంధనసంజ్ఞ వాగురాభేదంబు చిక్కమం చనఁగను జెలఁగుచుండు
మీటనా బిస యన మీఱుత్పతనకీల మలరును జవ యన యంత్రభేద
మేత మనఁగ ఘటీయంత్ర మెసఁగుచుండు మోటనంగను దద్భేద మొనరుఁ జేఁద
బొక్కెన యనంగఁ దబ్భేద మొప్పుచుండు భూషితభుజంగ శ్రీమాతృభూతలింగ.

293


సీ.

తంతుసంతతిసముత్పాదనయంత్రంబు రాట్న మంచనఁగను రహికి నెక్కుఁ
దద్బద్ధసూత్రంబు తగు వడియం చన గిరుకునా భ్రమకంబు పరఁగుచుండుఁ
దగుఁ గదు రనఁగఁ దంత్వాధారసూచిక తూలంబు విలసిల్లు దూది యనఁగఁ
దూలమృదూకృతి దోఁచు నేకు డనంగ నగుఁ దూలకణిక యేకని వచింప
వడుకు డనఁగను దంతుసంభవనహేతుకక్రియ చెలంగుఁ దంతువుగాఁ జెలంగుఁ
బోఁగు పోఁ చనఁగా నదె పుత్తడి యన మను సరిగ యనఁ గండెనా మాతృభూత.

294


సీ.

ఆసునాఁ జెలఁగుఁ దంత్వావర్చనాభిధ దనరు సూత్రము నూలు దార మనఁగఁ
బురిపిరి యనఁగఁ దత్కరణవేష్టన మొప్పు జెలఁగుఁ ద్వక్సూత్రంబు నులక యనఁగఁ
బొలుపొందును ద్రిసూత్రి మున్నూ లనంగను ముప్పేట యనఁగను ముప్పిరి యనఁ
దంతుచతుష్కంబు దనరు నెన్నిక యన షష్టితంతువులు పుంజ మన వెలయుఁ
దాంతవప్రతికృతిపేరు దనరియుండు సన్య యనఁ దంతువేష్టనసాధనంబు
పరఁగును బరంటె యనఁగను బంటె యనఁగఁ బంట్రకోల యనంగఁ జెవ్వందిలింగ.

296


సీ.

అలరు లాక యనంగ నర్చాభిధానంబు తగుఁ బడు గనఁగ నాతానసంజ్ఞ
వెలయు వితానంబు పేకయం చనఁగను వాయదండము నేఁతపల కనఁ దగు