పుట:Andhra-Bhasharanavamu.pdf/80

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శూద్రవర్గము

సీ.

శూద్రనామంబులు శోభిలు నాలవకొలమువారలని గాఁపు లని పల్కఁ
దద్విశేషమ్ములై తనరుఁ గమ్మని వెల్మ యని రెడ్డి యని రడ్డి యని వచింపఁ
బనివానిపేరుగా భాసిలు నౌ జనఁ గుమ్మరవాఁ డొప్పుఁ గుమ్మరి యన
మాలకరి యనంగఁ బూలమ్మువాఁ డగు మీఱు సూసరి యన గౌరకాఁడు
చిప్పె యనఁగను విలసిల్లుఁ జప్పెవాఁడు చెలఁగు నంచులవాఁ డనఁ జిత్రకారి
చికిలికాఁ డన శస్త్రమార్జకుఁడు దోఁచు భూతిలసితాంగ శ్రీమాతృభూతలింగ.

282


సీ.

తంతువాయాభిధ దనరు మగ్గరి యన నేతకాఁ డనఁగను నేతరి యన
దోఁచుఁ దద్భేదము ల్తొగటవాఁ డనఁగను సాలీఁ డనంగను సాలె యనఁగ
సాలెవాఁ డనఁ బుట్టుసాలెవాఁ డనఁగను దేండ్ర యనంగను జేండ్ర యనఁగఁ
గైకలవాఁ డనఁగను జర్మకారాఖ్య పరఁగు గోదరి ముచ్చెవాఁ డనంగ
మంగి యనఁగను మంగలవాఁ డెసంగు వఱలు జాఁకినాఁ జాకలివానిపేరు
ఈడిగ యనంగ నీడిగవాఁడు వెలయు భూషితభుజంగ శ్రీమాతృభూతలింగ.

283


సీ.

కమ్మరి కనుమరి కరుమలి యనఁగాను మీఱుచుండును నయస్కారసంజ్ఞ
కమ్మర మన నయస్కారకర్మం బొప్పుఁ గంచరవాఁ డొప్పుఁ గంచరి యన
స్వర్ణకారాభిధ పరఁగుఁ బారసి యగసాలి సొన్నారి కంసాలి యనఁగ
గ్రాపకారుఁడు కాసె కాసెవాఁ డనఁ దగు వడ్లంగి యన వడ్రవాఁ డనంగ
వర్ధకి విరాజిలుచునుండు వడ్ర మనఁగఁ బరఁగు వర్ధకికర్మంబు గురుప యనఁగఁ
దగును మేఁకలవానిపే ర్మమ్మలి యనఁ దంబళి యనంగ నంబినాఁ దనరుచుండు
దేవలుని పేరు త్రిశిరఃపురీవిభాసి.

284


సీ.

పాదకుం డొప్పు సువారంపువాఁ డనఁగను బూటకూళ్ళవాఁ డనఁగ వంట
పూటవాఁ డనఁగను బొలుపొందు శ్రీహరి దాసుఁడు దాహరి దాసరి యన
శివదాసనామంబు చెలఁగు జంగ మనంగఁ దిలఘాతుకుం డొప్పుఁ దెలికవాఁడు
[1]గానుగవాఁ డన వేణుకారకుఁ డొప్పు మేదరివాఁ డన మేదరి యన
నెసఁగుఁ బింజారి నాగఁ దూదేకువాఁడు పరఁగుఁ గుడ్యాదికారి యుప్పరి యనంగ
జలగడుగువాఁడు వెలయును జాలరి యన భూషితభుజంగ శ్రీమాతృభూతలింగ.

285


సీ.

పదవిజ్ఞుఁ డెసఁగుఁ జొప్పరి జాడకాఁ డన సంకులవాఁ డన శాంఖికుఁ డగు
సానలవాఁడు పూసలవాఁ డనంగను మణికారసంజ్ఞ యై మనుచు నుండు

  1. గాండ్లవాఁ