పుట:Andhra-Bhasharanavamu.pdf/79

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


నదియె నెరడైన గొగ్గియం చనఁగ వెలయుఁ జిప్పముత్తెం బటండ్ర దే చేయఁబడిన
వీనితూనిక చవి యన వెలయుచుండు భూరిభవభంగ శ్రీమాతృభూతలింగ.

276


సీ.

పద్మరాగాభిధ పరఁగు గెంపన నది వన్నె తగ్గిన గరపక్క యండ్రు
కృత్రిమం బగునది గేరు రవాయినాఁ దత్కాంతి విడి యనఁ దనరుచుండు
నాకాంతి మెం డైన నలరు మొక్కళి యన నాకెంపుపని కుచ్చె యనఁగ వెలయు
నతికాంతియౌ కెంపు నలరు జొక్క మనంగఁ బ్రభపేరు వెలయును బాట మనఁగఁ
బరఁగును బ్రవాళనామంబు పగడ మనఁగఁ బవడ మనఁగ సిరాజినా వానియెత్తు
కణు జనంగను విలసిల్లుఁ బ్రణుతభక్త భూరిభవభంగ శ్రీమాతృభూతలింగ.

277


సీ.

పొలుచును వజ్రంబు మూలరా లన మగరా లనంగ గురుజరా లనంగ
దత్ప్రతినిధి పేరు తఱుపునా విలసిల్లు మందాడినాఁ దత్ప్రమాణ మొప్పుఁ
గప్పురా లనఁగను గనుపట్టు నీలము ల్గొతుపునాఁ దద్భేద మతిశయిల్లుఁ
బటికమం చనఁగను స్ఫటికంబు విలసిల్లు బరఁగుఁ దద్భేదంబు పలుఁ గనంగ
మానికము రతన మనంగ మణి చెలంగు నదియు సచ్ఛిద్ర మైనఁ బూసనఁ దనర్చుఁ
గాకిబంగా రనంగ బేగడ యనంగ నభ్రకము దోఁచుఁ ద్రిశిరఃపురాధినాథ.

278


సీ.

కాంచనాభిధలు బంగారు బంగరు హొన్ను పసిడి పసిండి పొన్ పైఁడి పయిఁడి
పుత్తడియం చనఁ బొలుపారు నతిశుద్ధచామీకరాఖ్యలు చనుఁ గడాని
మేలిమి యపరంజి జాళువా కుందనం బుదిరి నా రజతాఖ్య యొప్పు వెండి
మడికా సనంగను మను వారకూటంబు పిత్తడియం చన నిత్తడి యనఁ
గాంస్యనామంబు విలసిల్లుఁ గం చనంగ రాగియం చన వెలయుఁ దామ్రాభిధాన
మయము విలసిల్లు నిను మన నలరుఁ దద్విశేష ముక్కని చెప్పఁగ శేషభూష.

279


సీ.

లోహమలాభిధ ల్పొలుపారుచుండును ద్రుప్పనఁ జిలు మనఁ ద్రుక్కనంగఁ
జట్టమం చనఁగను సింహాణమై దోఁచుఁ గాచము విలసిల్లు గాజనంగఁ
బింగాని కుప్పి కుప్పియ కుప్పె యనఁగను దక్కృతచషకాఖ్య తనరుచుంచు
నింగిలీకం బన హింగుళి విలసిల్లు హరితాళ మొప్పును నరిదల మనఁ
జెలఁగు సిందూరనామంబు చెందిర మనఁ దూది యనఁ దూల మొప్పును దుట్టె యనఁగఁ
బెర యనఁగ క్షౌద్రపటలంబు పేరు చెల్లుఁ
దేనె యన క్షౌద్ర మొప్పును మైన మనఁగఁ బొలుచు సిక్థంబు శ్రీమాతృభూతలింగ.

280


తే.

శ్రీలు వెలయంగఁ నీ పేరఁ జేయుకతనఁ బరఁగు శాశ్వతముగ వైశ్యవర్గ మిట్లు
గైకొనుము దీని భక్తసంఘాభిమాని, మాతృభూత జగత్త్రయీమాతృభూత.

281

ᛟᛟᛟᛟᛟᛟᛟᛟ