పుట:Andhra-Bhasharanavamu.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సీ.

మిడిగ్రుడ్లవాఁ డన మీఱు నున్నేత్రుండు నడ్డిముక్కుఁగలాఁ డన నతనానుఁ
డగు బుఱ్ఱముక్కు వాఁ డన గ్రద్దముక్కువాఁ డనఁగను గ్రమముగా నలరుచుండ్రు
ఖురణస ఖరణసు ల్పరఁగ ముక్కిఁడి యన విగ్రుండు మూఁగనా వెలయు మూకుఁ
డలరును బతికదంతాభిధ తొట్టివాఁ డన గొగ్గిపండ్లవాఁ డనఁగ బర్బ
రద్విజుండు వెలయు దంతురాఖ్య మిట్టపండ్లవాఁ డనఁ దగు గూనివాఁ డనంగఁ
బరఁగుఁ గుబ్జుండు కుకరుండు పరఁగుఁ దొంటచేతివాఁ డన శ్రీమాతృభూతలింగ.

121


సీ.

ఖంజుఁడు కుంటి నాగఁ గునిస్టి నాఁగను దోఁచును బ్రజ్ఞుండు డొడ్డికాళ్ళ
వాఁ డన మండికాళ్ళవాఁ డన సంజ్ఞుండు మీఱుచునుండును బూరకాలి
వాఁ డనఁగఁ బ్రవృద్ధపాదుఁడు దనరారు వల్మీకపాదుఁడు వఱలుఁ బుట్ట
కాలివాఁ డనఁగను గనుపట్టు వికలాంగుఁ డవిటినా మొండినా నపదుఁ డెసఁగు
వాఁపి యన నులిపి యన నుల్ప డన శోభి శోభిలును మూర్ఛితాభిధ సొమ్మసిలిన
వాఁ డనఁగ నొప్పుచుండును బొమనుండు దూలపో తన విలసిల్లు దురితదూర.

122


సీ.

పొట్టి మొటిమె గిటర పొదిటి పొదడుగున్న పొనుఁగు బుడుత గుజ్జు బురుక బుడిగి
కుఱుచ కుఱ్ఱ కురుజు కొటిక కుసులి కుట్ట మట్టసి మట్టము మట్టపమ్ము
గొనమ గొనప గొనిసె గునిసె గిఱక టింగణా యనఁగను వామనాఖ్య దనరు
మరుగుజ్జునాఁగ నమరుఁ గుజ్జనామంబు వాసినాఁ బొడవునా వఱలు నున్న
తుండు ధర్మంబు గానిది దోఁచు నొకటి వెజ్జనంగను వైద్యుండు వెలయుచుండు
నరవెనక నన్నియుఁ ద్రిలింగనామము లగు శ్రీకరదయారసాంక కంఠేకళంక.

123


సీ.

బాధిర్యసంజ్ఞ యై పరఁగును జెవు డన నంధభావంబు గు డ్డనఁగ వెలయు
గొగ్గియం చనఁగఁ దగును బర్బరత్వంబు గూను నాఁ గుజ్జత్వ మౌను మొండి
మొఱ్ఱన భిన్నత్వ మొనరును మచ్చనాఁ గాలకనామంబుగాఁ జెలంగుఁ
గాయయం చనఁగను గనుపట్టును గిణంబు గాయమం చనఁగను క్షతి దనర్చు
మం దనఁగ నౌషధాఖ్యయై మనును దెవులు కింక నా రోగసంజ్ఞయై కెరలుచుండు
నావి యనఁ జీడ యనఁగను నలరు సస్యరోగ మాశ్రితజనభవరోగవైద్య.

124


సీ.

పశుపాదరోగంబు పరఁగు నడుప యన నలరును మలిమిడి యనఁగను బశు
పార్ష్ణిరోగము పశువ్యాధిభేదాభిధ యొప్పుచునుండును నుంగిడి యనఁ
జిరుకనా గుఱుకనా సాంక్రామికామయాఖ్య చెలఁగుచుండు ముడిచె యనంగ
ద్వంద్వరోగంబు నివ్వటిలు దొంద మనంగ సన్నిపాతం బగు జన్ని యనఁగ
వాయి నాఁగను వాయువు వఱలుఁ గోరవాయి యనఁ గోష్ఠశీర్షస్థవాయు వొప్పు
మండవాయి యన న్గుల్ఫవాయు వగును భూషితభుజంగ శ్రీమాతృభూతలింగ.

125