పుట:Andhra-Bhasharanavamu.pdf/47

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సీ.

విటనామధేయమౌ విటకాఁడు వేడుకకాఁడు బొజుఁగు నన్సుకాఁడు లంజె
కాఁ డనఁగ నివియుఁగాక గోవాళ్ళనఁ గా నొక్క శబ్దంబు గలదు బహుత
లంజెయం చనఁగను లంజియ యనఁగను గులటాఖ్య యని వాడుకొనఁగవలయు
వావియం చనఁగను భావంబు తగు సాధ్వి తనరుచునుండుఁ గ్రొత్తడి యనంగ
నేతుల యనంగఁ దగుపాటియింతి వెలయు నాబిడ యనంగ నాపెనా నాకె యనఁగ
నల్లసతియనుమాటయై యలరుచుండు నట్టిఁ డనఁగను నట్టివాఁ డగును శర్వ.

116


సీ.

ఏలుకోటి యనంగ నెసఁగుఁ బ్రజాకోటి సదురం చనఁగ మనుజదశక మగు
గుడిసెవేటిది యన నడరుఁ గువేశ్యాఖ్య తగు బజాఱి యనంగ దండులంజె
గట్టివా జంత ఱాఁగ గయాళి యనఁగను ధూర్తయోషాభిధ దోఁచుచుండుఁ
బంద యనంగ దూబ యనంగఁ బేడినా షండనామంబుగాఁ జనును బాయ
మీ డనంగను బ్రాయమై యెసఁగు వెలయుఁ బాల్యమగు జిన్నఱిక మనఁ బడుచుఁదనము
నాఁగ బిన్నఱికం బన నలరు నీడు పాయ మన జవ్వన మన యౌవనము శర్వ.

117


సీ.

నిండుజవ్వన మగు నెలజవ్వనం బన ముదిమి ము ప్పనఁదగు ముసలితనము
నర వన నర యనఁ బరఁగును బలితము స్తనపాయి పరఁగును జంటివాఁడు
పసిబిడ్డ చంటిపాపఁడు పాలపాపఁ డనంగ బాలకసంజ్ఞ నలువు మీఱు
పాప పాపఁడు దుడ్డె పడుచన దుడుకఁడు బుడుత కుఱ్ఱ కొడుకు బొడిగ లేఁత
చిన్న పిన్న చిఱుత యనఁ జెలఁగుచుండుఁ గోడెకాఁడు కొమరుఁ డనఁ గొండి కనఁగఁ
దగుఁ గుమారుఁడు తరుణుఁడు దనరు వయసువాఁ డనుచుఁ బలుకంగఁ జవ్వందిలింగ.

118


సీ.

ముదినాఁడు ముదుసలి ముసలి పెద్దముదుకుఁడొక్క టొక్కు ముదురు పక్కు పన్న
లరగడం బనఁగను నలరు వృద్ధాభిధ బడుఁ గన బడు వస బక్క యనఁగ
వెలయు నమాంసుండు బలిమికాఁడు వలుద బలీయుఁడు బలిసినవాఁడు పలము
బల్లిదుండు బలుపు బలితము లావరి యన బలవంతుఁడు దనరుచుండుఁ
బెన్నెరులవాఁ డనంగను వెలయుఁ గేశి బోడి యని బోడఁ డనఁగను బోడ యనఁగ
బోడునా బోడివాడునా ముండుఁ డొప్పు నవితనిజదాసఝాట పశ్యల్లలాట.

119


సీ.

బొజ్జవాఁ డనఁగను బొఱ్ఱవాఁ డనఁగను బొట్టవాఁ డనఁగను బొసక యనఁగ
దొందన దొందునా దొద్దునా లందనాఁ దుందిలనామమై తోఁచుచుండు
బంబోతునా నెద్దువలెను మిక్కిలియొడ ల్బలిసియుండెడివాఁడు పరఁగుచుండు
గర్భిణీహస్తసంగతుఁడై న బాలుఁడు చంటివాఁ డనఁగను జనును లవిటి
చెవిటి యనఁగను బధిరుండు చెలఁగు గ్రుడ్డి యవిటి చీఁ కన నంధకుఁ డలరు మెల్ల
కంటివాఁ డనఁ గేకరాఖ్యయగు లొట్టకంటివాఁ డనఁ గ్లిన్నదృఙ్నామ మభవ.

120