పుట:Andhra-Bhasharanavamu.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సీ.

గృధ్రసి పే రగుఁ గిరుదెస యనఁగను దిమిరంబు వెలయును దిమిరి యనఁగఁ
బరఁగుఁ బ్రతిశ్యాయ పడిసెమం చనఁగను దుమ్మనంగ క్షుతంబు దోఁచుచుండుఁ
జీద్రుడం చనఁగను జెలఁగు నాసామల పరిహృతియును దద్భవారవంబు
సోఁ పన సో బన వాఁపన శోఫయౌ నౌదరశోఫ యై యలరు దోము
నాఁగఁ గాసంబుపేరు దనర్చుచుండు నుబ్బస మనంగ దగ్గన నుక్కిస మనఁ
గాసభేదము కుముటునాఁగను దనర్చు భూషితభుజంగ శ్రీమాతృభూతలింగ.

126


సీ.

రొండు రోజు వగర్పు రొప్పన శ్వాసమౌ వెక్కనా వేక్రి నా వెచ్చ యనఁగ
జ్వర మొప్పు క్షయము నవఁతనాఁగ విలసిల్లు సొలపు సొరగు సొమ్మ సొమ్మసిలుట
యన మూర్ఛ పేరుగా నలరుఁ బాలుడునాఁగఁ బాండువు విలసిల్లుఁ బసిరిక యనఁ
గామాల యనఁగను గామలాభిధ మీఱు నక్షిరోగవిశేష మైర యనఁగ
నలరుఁ గ్రక్కనఁ జరిదియం చనఁగఁ దనరుచుండుఁ బ్రచ్ఛర్దిగ్రహణియై యొనరుఁ బారు
డనఁగఁ బాచన మనఁగను నడరు నీరుకట్టనఁగ మూత్రకృచ్ఛ్రంబు గరళకంఠ.

127


సీ.

కడుపుబ్బునాఁగను నడరు నానాహాఖ్య యఱుకు వఱక మఱ్ఱె మన నజీర్తి
యగుఁ గ్రోవ యనఁగ దర్పామయంబు చెలంగు నర్శంబు మొలకయం చనఁగ వెలయు
గుట్టుసూల యనఁ గన్పట్టు శూల తలే రనఁగ శిరస్తోదము దగ్గును గుష్ఠ
ములు మనఁ గుష్టనఁ బులుమన విలసిల్లు దామరయనఁ బొడదామరయన
మండలక మొప్పు నాయల్పమండలకము చిరుగు డనఁగను దనరును జెలిది యనఁగఁ
ద్వగ్గతవ్యాధిభేదమై వఱలుచుండు మిహిరచంద్రాగ్నినేత్ర వామేకళత్ర!

128


సీ.

సిబ్బెము సోబె నా సిధ్మము విలసిల్లు మంగు డనంగను మం గనంగ
ముగు సిధ్మ నామ మొప్పును నింద్రలుప్తకం బగు నూలిగరసం చనఁగను గజ్జి
చిడుము నా ఖర్జువు చెలఁగును మొటిమెనా వదనఖర్జువుసంజ్ఞ వఱలుచుండు
శిశుఖర్జు వలరును జెవ్వయం చనఁగను దీంట్రమ్ము కసి తీఁట తీవరమ్ము
దూల జిల నవ నస గాడు దురద యనఁగఁ బరఁగుఁ గండూతి పుండునా వ్రణము దనరు
వఱలుఁ గురు పనఁగాను నల్పవ్రణంబు అతికృపాభాసి మధ్యేనగాధివాసి.

129


సీ.

ముండిలూటి యనంగ మర్మవ్రణం బొప్పుఁ జంతిక పుండునాఁ జను ననేక
రంధ్రవ్రణాభిధ రాచపుం డనఁగను రాజవ్రణము పేరు దేజరిల్లుఁ
బోటకమం చనఁ బొటక మంచన స్ఫోటక నామమై పొలుపుఁ గాంచు
బొబ్బ పొక్కనఁగ విస్ఫోటము విలసిల్లుఁ బగులుడు బీఁటిక వంగు డనఁగ
స్ఫోటము దనర్చుఁ బుంగుడు పులిపిలి యన నల్బమైనట్టి గ్రంథిగా నలరుచుండు
గాద మనఁగను గొప్పినాఁ గదుమునాఁగఁ దగును ఘాతభవగ్రంథి తరణిమౌళి.

130