పుట:Andhra-Bhasharanavamu.pdf/40

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ర్జూరిక తాడి మున్నగుతరు ల్పులు మ్రాకు లనంగఁ బోలు నీ
హారగిరీంద్రజాహృదయహర్మ్యగతీ త్రిశిరఃపురీపతీ.

79


తే.

శ్రీలు వెలయంగ నీ పేరఁ జేయుకతనఁ, బరఁగును వనౌషధీనామవర్గ మిట్లు
గైకొనుము దీని భక్తసంఘాభిమాని, మాతృభూత జగత్త్రయీమాతృభూత.

80

ᛟᛟᛟᛟᛟᛟᛟᛟᛟᛟᛟᛟ

సింహాదివర్గము

క.

మెకములఱేఁ డనఁ దెరవా, మెకమన సింగమన బొబ్బమెకమనఁ జనుఁ జు
మ్ము కరిరిపునామధేయము, లకలంకదయారసార్ద్రితాంతఃకరణా.

81


సీ.

బెబ్బులి యం చన వెలయు మహావ్యాఘ్ర మల్పశార్దూలాఖ్య యలరుచుండుఁ
జిఱుత చిఱుత పులి చిఱు పులి యం చన వాలము వేఁగినా వ్యాళ మెసఁగుఁ
జివ్వంగి నాఁగను జెలఁగుఁ దరక్షువు చాఱయం చనఁగను జాఱిక యన
వ్యాఘ్రవర్ణం బొప్పు నగు గోఁదిరిం పన వ్యాఘ్రగర్జాధ్వని వాలుమెకము
పంది సలు గేకలమ్మనఁ బరఁగు ఘృష్టి దనరు గామిడికాఁ డనఁ దద్గణేశుఁ
డలరుఁ దద్ఘోణ ముట్టెయం చనఁగఁ బుడ్డగింపనఁగఁ దద్ధరాఘాతి గేరు నభవ.

82


సీ.

హనుమఁడం చనఁగను హనుమదాఖ్యయుఁ గ్రోఁతి తిమ్మడం చన వానరమ్ము దనరు
గొండము చ్చనఁగను గొండంగి యనఁగ గోలాంగూల మెసఁగును నింగిలీక
మన మర్కటవిశేష మగు నెలుఁగం చన భల్లూకనామమై ప్రబలుచుండుఁ
గారెనుపో తనఁ గారుదున్న యనంగ వనమహిషం బొప్పు వఱడు నక్క
నాఁగ జంబుకమౌఁ గొంకనక్క యనఁగ క్షుద్రజంబుక మంచు నెంచుకొనఁదగును
వృకము తోఁడే లనం జను వెలయు శల్య మేదు సెలపంది యనఁగను వేదవేద్య.

83


సీ.

పిల్లియం చనఁగ జెల్లు బిడాలాఖ్య బావురుపిల్లినా బావు రనఁగఁ
జను మహామార్జాలసంజ్ఞ జాంగలబిడాలము జంగపిల్లినా నమరు బూత
పిల్లినాఁగను గమ్మపిల్లినాఁగను బున్గుపిల్లియటం చనఁజెల్లు గంధ
మార్జాలనామంబు మనును జవ్వాదిపిల్లియన సంకువు గోధికయగు నుడుము
నాఁగ మృగ మొప్పు నిఱ్ఱి యనంగ మృగియుఁ జెలఁగుచుండును లేడినా జింక యనఁగ
న్యంకునామంబు దగు పెంటిజింక యనఁగఁ బరఁగుఁ దత్స్రీసమాఖ్య సప్తర్షివంద్య.

84


సీ.

కొండగొఱియనాఁ దగును రోహిషాభిధ గోకర్ణనామం బగును గడంజు
కడఁజునాఁ బృషదాఖ్య యడరు దుప్పి యనంగ మనుబోతు మనుబిళ్ళు మన్ననంగ
ఋశ్యముదగుఁ గేసరి యన ఖేచర మగు సవరపుమెక మన జిల్లిమెక మ
నఁ జమరి వెలయు గంధర్వమౌను గడంతి కటకరమం చనఁగాను దుప్పి