పుట:Andhra-Bhasharanavamu.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తుంగ యనంగఁ జెలంగు ముస్తాభిధ వేణునామం బగు వెదు రనంగఁ
గీచకసంజ్ఞ యై తోఁచు బొం గనఁ గన్ను కనుపు గంటు గనుపం చనఁగఁ బర్వ
మమరుఁ గంతి కణింది బోటు ముడి గుబ్బ బుడిపి ముడుత యనంగను బొసఁగు గ్రంథి
యించు చెఱకనఁ దనరును నిక్షుసంజ్ఞ చనును రసదాడి యనఁగ రసాల మభవ.

74


సీ.

ఇక్ష్వాదికాండాఖ్య యెసఁగును గడ యన వాడెదవ యన నిక్ష్వగ్ర మొప్పు
గనె గండ్ర గండ్రిక గనియ యటంచన నిక్ష్వాదిఖండము లెన్నఁ దగును
గాకిచెఱు కనంగఁ గను మన శర మగుఁ గాశము ఱెల్లునాఁగను దనర్చుఁ
గిక్కస యనఁగఁ బెం పెక్కును నలసంజ్ఞ బొదయన బల్బజం బొనరుచుండు
వీరణాభిధ యౌరు నా వెలయు వట్టివేరు నాఁగ నశీరంబు మీఱుచుండుఁ
గస వనంగను దనరుఁ గిక్కస మొదలుగఁ గుస్సె దబ్బన దర్భ లగు న్మహేశ.

75


సీ.

క్షారతృణం బగుఁ గారెనాఁ గామంచి కావంచి యనఁదగుఁ గత్తృణంబు
నెండ్రయం చన ఛత్ర నెగడును జిప్పల చిప్పనా భూస్తృణ మొప్పు రక్త
తృణము చెంగలి యన గణుతి కెక్కును గడ్డి గాదము గవతము కసపు కవసు
పుల్లు పూరి యనంగఁ జెల్లును దృణసంజ్ఞ నలి యన నలు సన నలరు శుష్క
తృణము దుబ్బనఁ గామూల మెసఁగు బుల్ల పుడక యనఁగను దృణకాండము చను జొప్ప
యనఁగఁ దనరును యావనాళాదిసదనదండనామంబు మేరుకోదండహస్త.

76


సీ.

యావనాళాదిదండాఖ్య దం టన మీఱుఁ బచ్చిక యనఁ జను బాలతృణము
వామియటం చన వఱలును దృణతతి తొంట యనంగఁ దన్ముఖము దనరు
వంద వదియ వదె వందెయం చనఁ దృణతతివిశేషం బొప్పుఁ దా డనంగ
దాళాఖ్య యగు బాలతాళాఖ్య బొందనాఁ బరఁగుఁ గమ్మనఁ దాళపర్ణ మెసఁగుఁ
దత్పుటం బౌను బొటయనఁ దాళపుటనఁ బత్త్రవృంతంబు మట్టనా వఱలు మోపు
నాఁగఁ దాళాగ్రతరుణవర్ణంబు తెలఁగుఁ దాళపేశంబు గుంజనఁబోలు నభవ.

77


సీ.

తాళాదికశలాటు తనరు బొండ్ల మనంగఁ గెంగటం చనఁగఁ జెలంగుఁ దాళ
బీజాభిధానంబు రాజిలు నారికెడంబు టెంకాయచె ట్టనఁగ నాళి
కేరనామం బెళనీ రటం చనఁ జనుఁ దచ్ఛలాటుజలము తత్ఫలంబు
టెంకాయ యనఁగఁ రూఢిగను గొబ్బె రనఁ గొవ్వెర యటంచనఁగఁ దత్సేక మెసఁగుఁ
బోఁక యనఁ బోఁక్రమాననఁ బూగ మొనరుఁ బోఁక యనఁగను వెలయును బూగఫలము
ఖండితము లైనయవియ వక్కలనఁ దగును నలరు హింతాళ మీఁదా డనంగ నభవ.

78


ఉ.

కేరును గేతకి నొగలి గేదఁగియం చనఁ బేరులొప్పుఖ
ర్జూరము గజ్జురం బనఁగ శోభిలు నీఁ దన నీఁత నాఁగ ఖ