పుట:Andhra-Bhasharanavamu.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


యనఁగ రామంబు చను గవయమ్ము గోవ నాఁగ గొఱపోతునాఁగ దనర్చుఁ జెవుల
పోతు కుందే లనంగను ఖ్యాతిగాంచు శశసమాఖ్యలు బాలశశాంకమాళి.

85


సీ.

ఇప్పుడు చెప్పినయివియును సింగంబు మొదలుగా నావులు మొదలుగాను
పను లనఁదగు వేఱె పలికెద నాలుకనా మూషకసామాన్యముగఁ జెలంగుఁ
గల్లెల్క యనఁగను వెల్లెలుక యనంగఁ జిట్టెల్క యనఁగను జెలఁగు నిట్లు
కొన్ని తద్భేదము ల్కొక్కన గరిమిడి కొక్కనంగను బందికొ క్కనంగ
మూషికాభిధలగు గంధమూషికాఖ్య చుంచనంగను జుం డన నెంచఁదగును
గేరు నకులము ముంగిముంగిస యనంగ వెంట్రు వనఁగను బభ్రువు వెలయు నభవ.

86


సీ.

ఉఱుతనా నుడుతనాఁ దరుమూషికం బగుఁదోఁచు నూసరవెల్లి తొండ యనఁగ
సరటంబు నల్లికం చన నలికిరి యన మిండయం చనఁగను మీఱు రక్త
పుచ్ఛి బల్లి యన నొప్పును గృహగోధిక జాలకాఁడు చెలిఁదిసన్నపిల్లి
పాదొ ట్టనఁగ లూత పరఁగు దద్భేదంబు దోఁచు నీఁగపులి విందుపురు వనఁగఁ
బు ర్వనంగను బురు వనఁ బురు గనంగఁ గ్రిమి దనర్సును దగు వత్సకీటసంజ్ఞ
చీడపురు వన నత్తనాఁ జెలఁగు క్షుద్ర శంఖకీటంబు శ్రీబాలచంద్రచూడ.

87


సీ.

కాళ్లజెఱ్ఱి యనంగఁ గర్ణజలూకాఖ్య వెలయుఁ దే లనఁగను వృశ్చికంబు
ఎనుపతే లనఁ గృష్ణవృశ్చికం బగు మండ్రగబ్బనాఁ బృథువృశ్చిశాఖ్య యొప్పుఁ
దత్పుచ్ఛనామ మై తనరు గొండె యనంగఁ జెలఁగుఁ బిపీలిక చీమ యనఁగఁ
జెద లటం చన్నను శిథిలియౌ నల్లి నాఁ గాను మత్కుణ మొప్పుఁ బే ననంగ
నలరు యూకాఖ్య యీరునా వెలయులిక్ష యీసి యనఁగను లిక్షాన మెసఁగుచుండుఁ
బిడుఁ జనంగను బిణుఁజు నాఁ బిడుఁదు నాఁగ వఱలు గోమారి కైలాసపురవిహారి.

88


సీ.

పారావతం బగుఁ బావురాయి యనంగఁ బారువ మనఁగను బావుర మనఁ
దద్భేదములుగాను దనరుచుండును నేలపల్లటి యంతరపల్లటి సుర
టి లకోరి బట్టి యొడ్డీ కూకి బకదారి దూరబారు లనంగ శారికాఖ్య
గోరింక గోర్వంక గోరువంక గోరంక గోరువంక యనంగ మీఱుచుండుఁ
జనును శుకసంజ్ఞ బట్టికాఁ డనఁగ రామ తమ్మ యనఁ జిలుక యనఁగ దగును గోకి
లాభిధానము కోయిల యనఁగఁ బరఁగు భూరిభవభంగ శ్రీమాతృభూతలింగ.

89


సీ.

సాళ్వము జాలె వేసడము డేగలగుడు బైరి కణసరంబు నోరణంబు
జలకట్టె గిద్దుచెంచడ మన శ్యేనభేదము లివిగాకయు దళుకు బెళుకు
కంచు మిం చనఁగను గల వందు రన్నిట స్త్రీజాతి డేగనాఁ జెలఁగుచుండు
నది శ్యేనసామాన్య మని కొంద ఱందురు తోనికాఁ డనఁగఁ బుంశ్యేన మొప్పు