పుట:Andhra-Bhashabhushanamu.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

xv


భంగము లేదు. తేల్చి యర్ధబిందువున్నచోటఁ జదివినట్లు చదువవచ్చును. కాని పూర్ణబిందు పూర్వకప్రాసస్థానమున దీర్ఘముమీఁదిబిందువు నూఁది పలుకవలయును. ఇది యాధునికకవుల గ్రంథములలో లేదు. కాని ప్రాచీనకవులగ్రంథములలోఁ గేతనకాలపుఁగవులగ్రంథములలోఁ గొన్నిచోట్లఁ గలదు. క్వాచిత్కమగుటచే రెండుస్థలములు చూపుచున్నాను.

ఉ. "వీంగు నపారసత్యగుణవిస్ఫురణం బరమేశ్వరోరువా
    మాంగమునందు......................................................
   లోంగిన............................................................వే
    దాంగు ననంతు.....................................................".

క. "పోంకనలి నీరజస్వల
   సోంకిన దోషంబువాయ సూర్యుఁడు గవితా
   శంక నపరాంబుధిలోఁ
   గ్రుంకెనొకోయనంగఁ బ్రొద్దు గ్రుంకుడునంతన్."
                                  నన్నెచోడుని కుమారసంభవము.

తర్వాత కవులుగూడ కొంద ఱుపయోగించిరి. "కాంతకుమదిఁ బుట్టెడుతల పోంతలతో..." కాలిందీకన్యాపరిణయము. ఇట్టివి అరుదుగాఁ గలవు.