పుట:Andhra-Bhashabhushanamu.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

xvi

మొత్తముమీఁద సానునాసికరూపము అతిప్రాచీనమనియు, బూర్ణబిందుసహితము తర్వాతిదనియు, నది తేల్చి పలుకుటచే నర్ధబిందురూపము గలిగెననియు నిర్ధారణముచేయుట సయుక్తికము. కావున హ్రస్వముమీది పూర్ణబిందువు అర్ధబిందువగుననుట ప్రాచీనపుఫక్కిగాని, హ్రస్వముమీఁది యర్ధబిందువు పూర్ణబిందువగుననుట ప్రాచీనపుఫక్కిగాదు. ఈవిషయమున నాంధ్రభాషాభూష ణాంధ్రశబ్దచింతామణులపద్ధతి యెట్లున్నదో పరిశీలింతము.

—: ఆంధ్రభాషాభూషణము :—

క. "కుఱుచలతుది హల్లులకున్
   బిఱుఁద న్నెలకొన్నయట్టిబిందువులెల్లన్
   నెఱయఁగ నూఁదుచుఁ దేలుచు
   నొఱపై యిరుదెఱఁగుఁ జెల్లుచుండుం గృతులన్." 56

క. "ననుఁగను నన్నుంగను దా
   ఘనుఁడు ఘనుం డనఁగఁజెల్లుఁ గవ్యనుమతిచేఁ
   దనుబోఁటి లోభివాఁ డితఁ
   డన నిడుపులమీఁదిబిందు లరబిందులగున్." 57

క. "కుఱుచలపై యరబిందులు
   నెఱయఁగ నూఁదినను జెల్లు నిడుపులమీఁదన్
   నెఱయపు గద్యంబులలో
   నెఱబిందువు లూఁదుఁ బద్యనికరములోనన్." 58