పుట:Andhra-Bhashabhushanamu.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

xiv


ముగా నున్నస్థలములలోనయినఁ జింతామణిప్రక్రియను ఆదరమున్నచో మతాంతరముగాను లేనిచోఁ బ్రతికూలమతముగాను జూపుట వ్యాకరణరచనాపద్ధతి. కేతన వ్యాకరణమున నట్టివిషయ మెక్కడను గనఁబడదు. ఆవిషయములు ధ్రువపఱుప నొండు రెండుస్థలములు దిక్ప్రదర్శనముగా జూపెదను.

—: పూర్ణబిందువు, ఖండబిందువు :—

రాముణ్డు, రాముండు, రాముఁడు అనురూపములలో మొదటిది అనఁగా అనునాసికసహితరూపముఁ గనఁబడుచున్నది. ఆధునికులవ్రాఁతలలో నర్ధబిందువు వ్రాయఁబడుచున్నది. శాసనములలోను, తాళపత్రగ్రంథములలోను, గొన్నిచోట్ల హ్రస్వముమీఁద సానునాసికరూపముగాని సబిందుకరూపముగాని వ్రాయఁబడియున్నను అర్ధబిందుసహితరూప మున్నచోట్లవలెఁ దేల్చి పలుకవలయును. లేనిచో ఛందోభంగము గలుగును. ఆవిషయము శాసనపాఠకులకును, తాళపత్రగ్రంథద్రష్టలకును, విమర్శకులకును దెలిసిన సుప్రసిద్ధవిషయమే గాన గ్రంథవిస్తరభీతిచేత నుదాహరణము లీయలేదు. దీర్ఘముమీఁది బిందు వూఁది పలికినను, తేల్చి పలికినను గురుత్వమున సమానమే గాన ఛందో