పుట:Ananthuni-chandamu.pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ములు ప్రస్తరింపగా కడపటి IIIII (నలలము) ఒక లఘువు తక్కువగా రెండునగణములని అర్థముకావలెను.

“ఇరువది తొమ్మిదింట” అంటే అర్థము పొసగలేదు.

21-22. "ఈ పద్యములకు నర్థము సంశయముగా నున్న”దని 6 వ పుట అడుగున మూలములో ఉన్నది. అయితే 21వ పద్యము పరవస్తువారి ప్రతిలో.

క.

జగణము నలుగు గగములు
భగణము లగుగలము నగణభావంబు గనున్
నగము నగణగణము లగు
తగణము భలమగును సంయుతముఁ దీర్చినచోన్.

అని ఉన్నది. దీని అర్థము స్పష్టము. IUI=IIII; UU=UII; UI=III; IIUU=IIIIU; UUI=UIII.

22వ పద్యము పైపద్యములోని విషయములకు ఉదాహరణములు గలది గాని అర్థము పొసగలేదు.


మొగిళులు నలమగు, నిటులన్
సగణము నగణమగు నిటుల + నంగునితండ్రీ
భగణము పాళు లనంగా
తగణము వాకిళ్లు భలము వాకిళు లనఁగన్.

అని ఉంటే అర్థము కావచ్చును. పరవస్తువారిప్రతిలో మొదటిపాదమున్ను, రెండవపాదములో యతిస్థానమువరకున్ను