పుట:Ananthuni-chandamu.pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నే నుదాహరించినట్లే ఉన్నది; తర్వాత మూలములో ఉన్నట్లే ఉన్నది.

67. “దశరథాత్మజుఁడు స్వామి ధాత్రి కనఁగ" ఇందులో ద్విత్వమునకు పూర్వమందున్నది గనుక 'డు' ఊది పలుకవలెననిన్ని గురువుగా పలుకవలెననిన్ని అనంతుడు వ్రాసినాడు; గాని ఇది ఇతరలాక్షణికుల సమ్మతము కాదు. తెలుగులో పదాదినున్న ద్వి త్వమునుబట్టి వ్యస్తముగా ఉన్న పూర్వపదాంతవర్ణము గురువుకాదని తక్కినలాక్షణికుల మతము. 94. టీక వ్యావహారిక భాషలోనే ఉన్నది.

"... యిరువదిన్ని... స్వరయతియైనాను, వ్యంజనయతియైనాను ప్రయోగించతగును" అనే ఉన్నది. ఇందులోనే కాదు. అప్పకవీయము మొదలయినలాక్షణికగ్రంథము లన్నింటిలోను ఇట్లే వాడక భాషను టీకలు వ్రాసినారు. అనవసరముగా నిరాధారముగాను భాషమార్చి అచ్చువేయడము ఆచారమైనది.

101. ఈ పద్యము మూలములో తప్పుగా ఉన్నది. సరియైనపాఠము:-

"తే.

అఱ యనంగను బోవుట + కర్థమైన
సంధి నిత్యసమాసోక్తి+జరుగు రెంట
నసురవీరుల నెల్ల ను+క్కఱ వధించె
భానుకులుఁడు రావణుని నే+ పఱిచె ననఁగ