పుట:Ananthuni-chandamu.pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉన్నవి గనుక “తిశ్రగతి”ని[1] నడిపించవచ్చును. ఏడుహగణములున్ను గురువున్ను కలది సుగంధి ఏడునగణములున్ను గురువున్ను కలది విచికిలిత హగణనగణములలో ఏవైనా ఏడున్ను గురువున్ను గలది ఉత్సాహము. విచికిలిత నడక ఎట్లుండదగునో చూడండి:—

మునుల వలపు నబల బలము + ముదిమి సొగసు కలసిరుల్
చెనటి హితము విషము రుచియు+ చెఱలసుఖము పగహితుల్
తనివి తృషను కపికి స్థిరత + తమికి వెలుఁగు సెగవగల్
శనికి సుకృతి శిలల రసము + సవతి చెలిమి కలుగునే.

3. తురగము

ననననసజజగలు తిథివిరమ + ణం బ గున్దురగంబునన్
గనలుచు నగరముపమ విడిసిన+గాంచి తానొక రుండెదు
ర్కొనిదవులకుఁగొని చనిగిరిగుహ్య + గూర్కు నాముచికుందుచే
తను యవనునిఁ బొరిగొని వని వసు + ధన్గణింతురుభూవరుల్

(అప్పకవి)

దీని నడకతీరు ఈలక్ష్యమును బట్టి కనుగొనుట శక్యమా?

ననల యుగళము హభము రగణము + నాల్గుపంక్తుల నొప్పగాఁ
దనరు విరమము ననల యుగళము + దాటగాఁ దుగంబునన్.

  1. అనగా మూడుమాత్రలకు విరుగుతూ ఉంటుందని అర్థము. త్రి+అస్ర=త్ర్యస్య అని ఉండవలెను గాని సంగీతపుస్తకములలోని వ్యవహారము ననుసరించి 'తిశ్ర' అని వాడినాను.