పుట:Ananthuni-chandamu.pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


అదనదనున హరినుతు+లమరు ధరఁ బాలా
శదళ మనఁ దనరుఁ గవి + జనులు వచియింపన్
బదునొకఁ డగునెడ యతి + పదిలమునఁ జేరన్
గదియు నగణము అయిదు + గగము తుదనొందన్.

(అప్పకవి)

ఇంతకంటె అనంతుడు చెప్పినది బాగున్నదిగాని అందులో రెండవపాదము నాల్గవపాదము నడకచెడి యున్నవి (చూ. మూ. II.84) ఎట్లుండినయెడల నడక బాగుండునో తెలియజేస్తున్నాను:—

అయిదులము లయిదులము; +లయిదులములున్ గా
లయఁజనును ద్వరితగతి; + లములు పదిసాగన్
నియమమున వడియమర + నిలుచు శ్రుతికింపై
కయితలను దనరునిది + ఖగతురగశౌరీ.

2. విచికిలిత

ప్రవిలయసమయమునను బద + పడి జలనిధినడుము స
ద్భువనములు కడుపున నిడుక + భుజగపతిశయనముపై
నవిరమతి గురుకు వరదుఁ + డని విచికిలితఁ బదుమూఁ
డవ యెడ వడి యిరువదియొక +లఘువు గము బలుక నగున్.

(అప్పకవి)

ఇటుంటి లక్ష్యలక్షణపద్యముబట్టి దీనినడక ఎట్లు తెలుసుకోగలము? ఇందులో 21 లఘువులున్ను చివరను గురువున్ను