పుట:Ananthuni-chandamu.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వేయవలెను. దాని ప్రక్కను మళ్లీ అదేవిధముగా సంఖ్యలు వేస్తూ ఉండవలెను. ఎన్నో ఛందమునకు ఈ చక్రము వేస్తున్నామో చూచుకొని అందులో ఎన్ని వృత్తములు పుట్టినవో ఆసంఖ్యకు మించకుండా అంకెలు వేసుకొంటూ వెళ్లవలెను.

కొన్నివృత్తముల లక్షణమును లాక్షణికులు వివిధముగా చెప్పినారు, చూడండి:-

1. క్రౌంచపదము.

1. క్రౌంచపదా బ్మౌస్మౌ నననా న్గావిషు శరవసుమునివిరతిరిహ భవేత్
UII UUU IIU UII III III III III U
భ మ స భ న న న న గ

(ఇది సంస్కృతవృత్తలక్షణము. 25వ ఛందము 16776391వ వృత్తము)

2. శీతకరోర్వీవాతశ + శాంకర్ యుగమితమరపురనివహదకడియోళ్ (ఇది కన్నడపద్యలక్షణము. ఇందులో విశేషము:— ప్రతిపంక్తిలోను ప్రాసయతి. తక్కినలక్షణము సంస్కృతమం దున్నట్లే ఉన్నది)

3. పంచశరాభా + నంచిత పుణ్యా + భమసభనననయ + పరిమితమైనన్ (కవిజనాశ్రయము)