పుట:Ananthuni-chandamu.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

1గు10 అంటే 10న్ని గురువులే అయినవృత్తము ఒకటి
10గు9 అంటే 9గురువులున్ను 1 లఘువున్ను అయినవి 10
45గు82 అంటే 8 గురువులు 2 లఘువులున్ను ఉన్నవి 45

ఈలాగుననే కడమవి తెలుసుకోవచ్చును. 6. సగణలగక్రియ శకటచక్రము (చూ.మూ. III.72-76

1 | ఇది పాదములో అన్నీ గురువులే కలవృత్తము (1)
2 | 3 | 5 | 9 | 17 |ఇవి 1 లఘువుగలవృత్తములు (5)
4 | 7 | 13 | 25 | 6 | 11 | 21 | 10 | 19 | 18 | ఇవి 2 లఘువులు గలవి (10)
8 | 15 | 29 |14 | 27 | 25 | 12 |23 | 22 | 20 | ఇవి 3 లఘువులు గలవి (10)
16 | 31 | 30 | 28 | 24 | ఇవి 4 లఘువులుగల వృత్తములు (5)
32 | ఇది 5 లఘువులు గల వృత్తము.

ఈ చక్రము వేసేపద్ధతి: —

నిలువుగా ఉన్న మొదటిఆరుగళ్లలోను−1,2,4,8,16,32 ఇట్లు సంఖ్యలు ద్విగుణముగా వేయవలెను. తర్వాత అడ్డుగా ప్రతిసంఖ్య ద్విగుణముచేసి ఒకటి కొట్టివేస్తూ అట్లుచేయగా వచ్చిన సంఖ్యప్రక్కను మళ్లీ అట్లే చేస్తూ వేయవలెను. ఈఛందమున 32 వృత్తములకంటే ఎక్కువ పుట్టవు గనుక 32కు మించే సంఖ్య వేయరాదు. ఇట్లు చేసినత ర్వాత పైచాలున ఉన్న సంఖ్యలు క్రింది చాలున ద్విగుణముచేసి వేయవలెను. ఈసంఖ్యలలో ప్రతిదానిప్రక్కను అది ద్విగుణము చేసి ఒకటి కొట్టివేయగా వచ్చిన సంఖ్య