పుట:Ananthuni-chandamu.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

4. ప్రాంచిక తేజః + కుంచితవైరీ + భమసభనననయ + పరిచితరీతిన్ (కావ్యాలం కారచూడామణి.)

5. కాంచనభూషా + సంచయ మొప్పన్ + ఘనకుచభరమునఁ+గవునసియాడన్ (ఛందోదర్పణము).

పై మూడింటిలో (3, 4, 5) లక్షణము మారినది. ఈలాక్షణికులు దీనిని 24వ ఛందమునందు పుట్టిన 4193479 వ వృత్తముగా చెప్పినారు. సంస్కృతములోను కన్నడములోను పాదాంతమున ఉన్న IIU మార్చి UU చేసినారు. మాత్రలసంఖ్య ఒక్కటే గనుక నడకలో భేదము కనబడదు. కన్నడపద్యమువలెనే ప్రతిపాదమునందును ప్రాసయతి ఉన్నది; అంతేకాక తెలుగుపద్యముల సంప్రదాయ మనుసరించి మొదటి అక్షరముతో రెండుచోట్ల వడి ఉన్నది.

6. పంచముకేశుం డిచ్చిన భాస్వ + ద్వరమున మనమున +బవరముగోరన్
వంచనతో బాణాసురుహ స్త + వ్రజములు..................................

(ఇది అప్పకవిది. తక్కిన లాక్షణికులు చెప్పిన ప్రాసయతి ఇతడు పాటించలేదు.)

7. తావులు విూరం + బూవుల వానల్ + దఱుచుగఁ గురియఁగ + దతఘనభేరుల్ (ఇది కంకంటి పాపరాజు ఉత్తరరామాయణములోనిది. అప్పకవి కాక తక్కిన తెలుగులాక్షణికులు చెప్పినట్లే ఉన్నది.