పుట:Ananthuni-chandamu.pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నన్నయపాటించిన యతిస్థలమునకు పూర్వము రెండుఇంద్రగణములు ఒక సూర్యగణము మరియొక ఇంద్రగణము ఉండవలెనని గదా అనుకొంటున్నాము. ఆసూర్యగణము మూడవచోటనే కాక మరియొకస్థలమునందైనా ఉండవచ్చునని నన్నయ అభిప్రాయమేమో! చూడండి:--

తనదివ్య శక్తిన ప్పాశముల్ విడిచి + తన్మునినాథు
నమరంగ ధర్మువు రక్షించుఁ బ్రీతి + ననిశత్రులందు
గలుగుటె ఱింగియు పాయపూ ర్వమున + గడఁగితత్సిద్ధి
అరుణస రోరుహ దళమ్మను లంబు + లైనయిత్తరుణి
పరగనా కారణ ముననిట్టి దుఃఖ + భారముదాల్చె
నరిగెనీ శానుది క్కునకునీ యనుజుఁ + డనిలవేగమున
తోనేఁగె నుత్త రముమించి ధర్మని+త్యుఁడు ధర్మజుండు
నీపరో క్షంబున రాజుగా వలయు + నెమ్మినిట్లీఁగ
ఏమేము మున్నుపూ జింతుము రుద్రు + నిందనివేడ్క

ఇట్లు సమాధానము చెప్పి ఇటువంటి పాదములకు లక్షణము నిరూపించవచ్చును గాని ఇదమిత్థమని చెప్పలేము. చాలా వ్రాతప్రతులు జాగ్రత్తగా పరిశీలించి విమర్శించవలసి ఉన్నది.

“పదుండ్ర బోలెడు...” (ఆర. II. 343) ఈపద్యమున మొదటి రెండు చరణములలోను జగణమున్నది. ఇది మనవారు చెప్పిన సూర్యేంద్రచంద్రగణములలో గాని, కన్నడమువారు