పుట:Ananthuni-chandamu.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చెప్పిన బ్రహ్మవిష్ణురుద్రగణములలోగాని చేరలేదు. "పదుగురు” అన్న పాఠము కొందరిచ్చినారు.

షత్ప్రత్యయములు

అనంతుడు షత్ప్రత్యయములను సూత్రప్రాయముగా చెప్పినాడు. విద్యార్థులకు సులభముగాను స్పష్టముగాను బోధపడవలెనని వాటిని వివరించి వ్రాస్తున్నాను.

1. ప్రస్తారము (చూ. మూ. iii. 66)

అయిదవ ఛందమునకు ప్రస్తార మేలాగుచేయవలెను? మొదట అయిదుగురువులు ఉంచవలెను; దానిక్రింద మొదటిగురువు లఘువుగా మార్చి లఘువుగీత గీచిన తర్వాత కడమ వన్నీ మీదిచాలు ననుసరించి గురువులే వేయవలెను. రెండవచాలు చూచి మూడవది, మూడవదానిని చూచి నాలుగోది ఈలాగున కడవరకు వెళ్లవలెను. మీదిచాలున IIUIU ఉన్నప్పుడు మొదటి రెండులఘువులున్ను గురువులుగా మార్చి తర్వాత నున్న గురువు లఘువుగా మార్చి, లఘువు కనబడినది గనుక మరి మార్చకుండా మీదిచాలున ఎట్లుంటే ఆలాగున వేయవలెను. అట్లు వేయగా UUIIU ఏర్పడుతుంది.