పుట:Ananthuni-chandamu.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


నంగురు కులహాని [1]కరుఁడై ధారుణీ + నాథనీ సుతుఁడు
సమరంగ ధర్మువు [2]రక్షిం చుంబ్రీతి + ననిశ త్రులందు

ఇటువంటి పాదములకు లక్షణము కుదిరినది.

ఇంతవరకే రాజగోపాలరావు పంతులుగారు చెప్పినసమాధానము నాకు తోడుపడినది. లక్షణసమన్వయము (అనగా మనతెలుగువారు చెప్పినలక్షణముబట్టి) కాలేదని నేను పైని చూపించిన పాదములలో ఇంకా కొన్ని ఉండిపోయినవి. అటువంటిపాదములకు రాజగోపాలరావుగారు సమాధానము ఏమి చెప్పినట్లు కనబడదు. నేను చూచిననాలుగైదు ప్రతులలోను అచ్చుపడ్డప్రతులలోను ఆపాఠములు కనిపించుచుండుటచేత అవి నన్నయపాఠములే అయి ఉండుననుట తప్పుకాదు.

అయితే ఇవి ఎట్లు లక్షణసమన్వితములు కాగలవు? ఇందుకు నేను చెప్పేసమాధానమేమంటే కన్నడ పిరియక్కరలోను తెలుగు మహాక్కరలోను ఒక సూర్యగణము సామాన్యలక్షణము చొప్పున ఉండవలసిన స్థలమందేకాక 2-వ స్థలమందైనా 4–వ స్థలమందైనా ఉండవచ్చును అని ఉన్నది గదా. అట్లే ఈమధ్యాక్కరలోకూడా కవికి స్వాతంత్ర్యముండెనేమో.

  1. 'కరుఁడయి' అని కొన్నిప్రతులలో ఉన్నది; గానీ కరుఁడై అనియైనను ఉండవచ్చును.
  2. 'రక్షించుఁ బ్రీతి' అని కొన్ని అచ్చుప్రతులలో ఉన్నది గాని వ్రాతప్రతులలో అనుప్వారమున్నది.