పుట:Ananthuni-chandamu.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

"అనిన వసిష్ఠుణ్ణిట్లనియె నన్తధనంబును నట్టి రాజ్యంబుం” అని శాసనములో ఉన్నట్లు పూర్వలేఖనసంప్రదాయమును అనుసరించి ఉన్న ఈచంపకమాలాపాదము, "అనిన వసిష్ఠుఁ డిట్ల నియె+నంత ధనంబును నట్టి రాజ్యముం" అని చదువవలెను.

ఆలాగుననే, “గనిమల్లణ్డెత్తించె గుడియు మఠంబునుం గార్తికేయునకు” అని యుద్ధమల్లుని శాసనాక్కరపాదమును తెలుగులాక్షణికులు చెప్పిన లక్షణము కనుసరించి,

“గనిమమల్లఁ | డెత్తించె | గుడియు | మఠమునుఁ | గార్తికేయునకు” అని చదివి గణవిభజన చేయవచ్చును.

అయితే ఇప్పుడు శాస్త్రులవారు చేసిన దేమంటే, :— పైని చూపినట్లే గణవిభజన చేసి అర్ధానుస్వారములకు బదులుగా పూర్ణానుస్వారములే ఉంచి అప్పుడు నిలువుగీతల నడుమను ఏగణములు ఏర్పడునో అవికూడా సూర్యేంద్రగణములుగా పరిగణించవలెను అన్నారు. తెలుగులాక్షణికులమతమున పైపాదములో 'నల, త, న, నల, ర, న' గణము లుండునంటే, శాస్త్రిగారు 'నగ, త, న, జగ, ర, న' గణము లున్నవని అంటున్నారు.

ఈలాగుననే శాసనములోని మధ్యాక్కరల పాదములకు గణవిభజనము చేసి శాసనగృహీతగణప్రస్తారము చూపించి, ఆ ప్రస్తారముబట్టి ఏర్పడిన “ఇనేంద్రగణములభేదము నంగీకరించి గ్రహించినచో, నిటీవలి మన తెనుఁగులాక్షణికులు గ్రహించిన