పుట:Ananthuni-chandamu.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మధ్యాక్కరలక్షణమె పై శాసనాక్కరలకును గుదురుపడును” అని వ్రాసినారు.

వీరిప్పుడు క్రొత్తగా తెచ్చిపెట్టిన గణములు (IUI, IUU, IUUU, IUIU, IUUI, IUII[1]). కర్ణాటలాక్షణికులు తమ బ్రహ్మ విష్ణు గణములందుగాని, తెలుగులాక్షణికులు తమ సూర్యేంద్రగణములందుగాని వీటిని చేర్చుకోలేదు. తెలుగులాక్షణికులు గ్రహించిన సూర్యేంద్రగణములు మార్చి ఆ తెనుగులాక్షణికులు గ్రహించిన మధ్యాక్కరలక్షణమె పై శాసనాక్కరలకు కుదురుపడును అని శాస్త్రులవారు వాదించుటవల్ల లక్షణసమన్వయము సిద్ధించినదా? సూర్యేంద్రగణముల గురించి తెనుగులాక్షణికులు చెప్పిన లక్షణము కేవలము మధ్యాక్కరలకోసమై[2] మార్చి హ్రస్వాక్షరములకు పరమందున్న పూర్వానుస్వారములను వీలయినచోట్ల అర్ధానుస్వారములుగా పరిగణించే పూర్వసంప్రదాయమును పరిత్యజించి శాస్త్రులవారు ఒక క్రొత్తమార్గమును అవలంబించుటవల్ల ప్రయోజనమేమైనా ఉంటే ఆక్షేపణముండకూడదు. వారిమార్గ మవలంబించవలసినదే అవును. శాసనాక్కరల లక్షణము చెప్పడమే ప్రయోజనమంటే, వారీలాగున క్రొత్తమార్గ

  1. వారివాదము ననుసరించి 'IUI' కూడా ఇంద్రగణములలో ఉండవలెను. పు. 88 లో ఉన్న ప్రస్తారపట్టికలో లేదు; వ్రాయమరచినారో? అచ్చుతప్పో? వారిమతమున శాసనాక్కరలలో “క్రమంబున| దానిక..."అనేపాదమం దీగణమున్నది.
  2. శాస్త్రులవారు క్రొత్తగా తెచ్చిపెట్టిన ఇనేంద్రగణములు సీవములు మొదలయిన తక్కిన తెలుగుపద్యములందు ఉపచరించునా?