పుట:Ananthuni-chandamu.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చూపించిన అనంతుడు ఈఆర్యాగీతులందు మాత్రము చూపించియుండడా! అజ్ఞానముచేత కొందరు లేఖకులు అనంతుని ఆర్యాగీతులను కందములవలె నడిచేటట్లు “సవరించి” రూపుమాపినారు. అనవసరముగా అతికినమాటలు తీసివేసినయెడల వాటిలో లక్ష్యలక్షణములు రెండున్ను స్పష్టముగా కనబడగలవు. చూడండి:-


పథ్యార్య—

బేసులు త్రిగణయుతము లై
యాసమపాదములఁ బొరసి + యార్యయనన్
భాసిల్లుఁ బథ్య యనఁగా
వాసవముఖదివిజ+వర్గనుతా.


విపులార్య—

ప్రకటసమపాదముల నిలు
వక శబ్దము నవలఁ జొచ్చి+వచ్చినఁ ద
క్కక విపులార్యయగును సే
వక జనమందార+వనజాక్షా.

(పుట. 66)


చపలార్య—

వరుసను ద్వితీయ మంత్యము
స్ఫురద్గమాద్యగజకార+ములు దగరెం
డరయఁగఁ దనర్చునేనిన్
హరీ మురారి చప+లార్య యగున్.

(పుట. 66)


ముఖచపలార్య—

చపలా గణప్రకారం
బపారకారుణ్యసాగ+రా! ప్రథమా
ర్థపరం బగుచున్నది ముఖ
చపలార్య యనంగఁ +జనుఁ గృతులన్.

(పుట. 66)